నవ్వుల ఆర్యోగానికి మేలు చేస్తుందని, బాధలో ఉన్న మనసును తేలిక పరుస్తుందని తెలిసిందే. అందుకే వీలైనంత నవ్వాలని చెబుతుంటారు.
ఉచితంగా పొందే నవ్వును లాఫింగ్ క్లబ్‌లో చేరి మరీ పొందుతున్నారు జనాలు. అయితే కేవలం నవ్వు మాత్రమే కాదు ఏడుపు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుందని మీకు తెలుసా.?
మనసులో చెప్పలేని బాధ ఉన్నప్పుడు ఏడ్చేయాలని చెబుతున్నారు నిపుణులు. దీనివల్ల మానసిక ఒత్తిడి దూరమై మనసు తేలిక పడుతుందని చెబుతున్నారు.
మనస్ఫూర్తిగా ఏడ్వడం వల్ల మనస్సు ప్రశాంతంగా మారుతుందని చెబుతున్నారు. అలాగే మానసికంగా ఎదురయ్యే ఒత్తడి కూడా తగ్గుతుందంటా.
ఇక ఏడ్వడం వల్ల కేవలం మానసిక ఆరోగ్యమే కాకుండా కంటి ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుందని నిపుణులు మాట. కన్నీరు వల్ల కళ్లు శుభ్రమై అనేక రకాల బ్యాక్టీరియా నుంచి రక్షణ పొందవచ్చని చెబుతున్నారు.
చెప్పరానంత బాధలో ఉన్న సమయంలో మనసు నిండా ఏడిస్తే గుండె మరింత స్ట్రాంగ్ అవుతుంది. సమస్యను ఎదుర్కొనే ధైర్యం వస్తుంది.
ఏడ్వడం వల్ల మెదడులో ఆక్సిటోసి, ఎండార్ఫిన్ వంటి రసాయనాలు విడుదలవుతాయని మానసిక నిపుణులు చెబుతున్నారు.
ఈ రసాయనాల వల్ల శరీరంలో మానసి భావోద్వేగాల్లో మార్పులు వస్తాయి. శరీరానికి నొప్పిని తట్టుకునే సామర్థ్యం పెరగుతుంది.