మన దేశంలో ప్రతిఏటా నిర్వహిస్తున్న ఐఐటీ జేఈఈ ప్రవేశ పరీక్ష ప్రపంచంలోనే కష్టతరమైన రెండో పరీక్షగా ఉంది.
ఐఐటీ జేఈఈ మాత్రమే కాదు.. యూపీఎస్సీ, GATE (గేట్) పరీక్షలను మన దేశంలో అత్యంత కఠినమైన పరీక్షలుగా పరిగణిస్తారు.
ఐఐటీ జేఈఈకి సన్నద్ధమవ్వడానికి రెండేళ్లు, యూపీఎస్సీకి ఏడాది, గేట్ పరీక్షకు ప్రిపేర్ అవ్వడానికి ఆరు నెలల సమయం పడుతుంది.
అయితే వీటికంటే ఎన్నో రేట్లు కష్టమైన పరీక్ష ఒకటి ఉంది. ఈ పరీక్షలో ఉతీర్ణత కూడా చాల కష్టం. ప్రపంచంలో అత్యంత కస్టమైన పరీక్ష కూడా ఇదే.
చైనాలో నిర్వహించే గావోకావో పరీక్ష ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్ష. ఈ పరీక్ష తొమ్మిది గంటల పాటు ఉంటుంది.
ఈ పరీక్ష రాయడానికి ప్రతి సంవత్సరం చైనా దేశవ్యాప్తంగా దాదాపుగా 12 మిలియన్ల మంది అభ్యర్థులు హాజరవుతారు.
ప్రపంచంలోనే అత్యంత టఫ్ పరీక్షల జాబితాలో ఉన్న ఇతర పరీక్షలు మరికొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం
చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ (CFA), సిస్కో సర్టిఫైడ్ ఇంటర్నెట్‌వర్క్ ఎక్స్‌పర్ట్ (CCIE), యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామినేషన్ (USMLE), కాలిఫోర్నియా బార్ పరీక్షలు.