మీరూ ఉదయం నిద్రలేవగానే ఫోన్‌ చూస్తున్నారా?

ఉదయం నిద్రలేవగానే ఫోన్‌ స్క్రీన్‌ చూస్తే ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది

దీని వల్ల ఒత్తిడి పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు 

ఫోన్‌లో వచ్చే నోటిఫికేషన్‌లు, ఈ-మెయిల్‌, సోషల్‌ మీడియా అప్‌డేట్‌ల వల్ల అనవసర ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది

తెలియకుండానే ఫ్రెష్‌ మార్నింగ్‌ వేళ మనసులో ప్రతికూలతలు పెరిగిపోతాయి

ఆ ప్రభావం రోజంతా కనిపించే అవకాశం ఉంటుంది

పొద్దున్నే ఫోన్‌ చూస్తే ఆ ప్రభావం మానసిక స్థితిపైనా ప్రతికూలంగా ఉంటుందట

మొబైల్‌ స్క్రీన్‌ నుంచి వచ్చే బ్లూలైట్‌ కంటిలోని మెలటోనిన్‌ ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తుంది

ఈ హార్మోన్‌ లోపిస్తే నిద్రలేమి సమస్య ఎదురవుతుంది