వర్షకాలం ఇలాంటి దుస్తులు అస్సలు ధరించవద్దు.. 

TV9 Telugu

10 July 2024

వర్షాకాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా లేకుంటే జబ్బుల బారిన పడాల్సిందే.

వర్షాకాలంలో ముఖ్యంగా బట్టల విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం. బట్టలు విషయంలో పాటించవలసిన జాగ్రత్తలేంటో తెలుసుకుందామా.

సాధారణంగా మిగతా వాతావరణంలో వేసుకునే బట్టలు వర్షాకాలంలో సరిపోవు. కాబట్టి ఈ సీజన్ లో రాజీ పడకుండా మీకు కంఫర్ట్ గా ఉండే బట్టలనే వేసుకోవాలి.

మందంగా ఉన్న బట్టలు కాకుండా సన్నగా వదులుగా ఉండే బట్టలు వేసుకొంటే వర్షంలో తడిచిన త్వరగా ఆరిపోతాయి. దీంతో మన బాడీకి ఎలాంటి సమస్యలు ఉండవు.

అలాగే లూజ్ గా ఉండే ప్యాంట్స్, టీ షర్ట్స్, లైట్ వెయిట్ గా ఉండే బట్టలు వేసుకోవచ్చు. పాలిస్టర్ బట్టలు అయితే ఈ టైమ్ లో బెస్ట్ అని చెప్పవచ్చు.

వానాకాలంలో ఆడవారు చీరలు, చుడీదార్స్, కుర్తలు వేసుకోకపోవడమే మంచింది. ఈ బట్టలపై బురదపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఏ కాలంలో అయినా ఆడ, మగ అనే తేడా లేకుండా చాలా మంది జీన్స్ ని ఇష్టపడతారు. జీన్స్ ని ఎప్పుడైనా, ఎక్కడైనా వేసుకుంటారు.

రెయినీ సీజన్ లో జీన్స్ వేసుకోకపోవడమే మంచిది. ఇవి ఆరడం కూడా చాలా కష్టం కాబట్టి వీటిని ఈ కాలంలో ప్రిఫర్ చేయకపోవడమే బెటర్.