కారు డిక్కీలో వీటిని మాత్రం అస్సలు పెట్టకండి!!
TV9 Telugu
06 February 2024
కారు కొన్న తర్వాత చేయాల్సిన ముఖ్యమైన పనులు ఇంకొన్ని ఉన్నాయి. వాహనం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
పాజిటివ్ ఎనర్జీ పెరుగాలంటే కారులో కొన్ని వస్తువులు పెట్టుకోకుండా ఉంటే ప్రతికూల శక్తుల ప్రభావం తగ్గుతుంది.
వాహనంపై ప్రతికూల శక్తిని తొలగించుకోవడం కోసం ఈ ప్రత్యేక నియమాలు తప్పనిసరిగా పాటించాలని అంటున్నారు నిపుణులు.
కొంత మంది అవసరమైన వస్తువులతో పాటు ప్రతిదీ కారు డిక్కీలో దాచుతుంటారు. భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని వస్తువులను కారు డిక్కీలో ఉంచకూడదు.
ఏదైనా వేడి చేసిన వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ కారు డిక్కీలో ఉంచకూడదు. దీంతో కారులో మంటలు చెలరేగే ప్రమాదం ఉంది.
కారు డిక్కీలో బట్టలు ఎప్పుడు ఉంచకూడదు. ఫ్యూయెల్ ట్యాంక్ సమీపంలో ఉండటం వల్ల బట్టలు త్వరగా మంటలు అంటుకుంటాయి.
కారు డిక్కీలో ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా ఉంచకూడదు. అలాగే గ్యాస్, పెట్రోలు వంటివి వస్తువులను పెట్టకూడదు.
ప్లాస్టిక్ సీసాలు కూడా వేడి కారణంగా కరగడం ప్రారంభిస్తాయి. ఇది కారు భద్రతకు మంచిది కాదు. అందుకే డిక్కీలో వీటిని ఉంచవద్దు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి