మద్యంతోపాటు వీటిని అస్సలు తినకూడదట..!

TV9 Telugu

27 May 2024

ఆల్కహాల్‌ తాగేప్పుడు వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

మద్యం సేవించిన తర్వాత పాలు లేదా పాల ఉత్పత్తులను అసలు తినవద్దని సూచిస్తున్నారు వైద్య ఆరోగ్య నిపుణులు.

ఆల్కహాల్‌తో జీడిపప్పు లేదా వేరుశెనగ తినవద్దు. దీనివల్ల సమస్యలు వస్తాయి అంటున్నారు పోషకాహార నిపుణులు.

ఆల్కహాల్‌ సేవిస్తున్న సమయంలో చాలామంది తరుచు వేయించిన ఆహారాన్ని తీసుకుంటారు. అయితే దీన్ని తినవద్దని అంటున్నారు.

అలాగే కొంతమందికి మద్యం సేవించిన తర్వాత స్వీట్లు తినే అలవాటు ఉంటుంది. అలాంటివారు మిఠాయిలు తినడం మానుకోండి.

చాలామంది ప్రజలకు సోడా లేదా శీతల పానీయాలతో మద్యం తాగడం అలవాటు ఉంటుంది. దీన్ని తక్షణమే మానుకోవడం చాల మంచిది.

పిజ్జా ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. అలంటి పిజ్జా మద్యం సేవిస్తూ తింటే మాత్రం మరిన్ని సమస్యలు వస్తాయి.

మద్యంతోపాటుగా బిర్యానీలు, స్పైసీ ఆహారాలను తింటే అరుగుదల ఇబ్బందులు ఎదురవుతాయి. బఠానీ జాతికి చెందిన గింజలు, పప్పులను కూడా తీసుకోవద్దు.