వీరు వీలైనంత దూరంగా తులసి ఆకులకు ఉండాలి.. ఎందుకంటే 

19 April 2024

TV9 Telugu

Pic credit - Pixabay 

తులసి ఆకులు ఔషధాల గని. విటమిన్ ఎ, సి నుంచి మెగ్నీషియం, ఐరన్, పొటాషియం మొదలైన అనేక మూలకాలను కలిగి ఉంటాయి.

తులసి లక్షణాలు

జలుబు, దగ్గును నయం చేయడమే కాదు జీవక్రియను, రోగనిరోధక శక్తి పెంచుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 

ఆరోగ్యానికి తులసి

తులసిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ గుణాలు లేనప్పటికీ.. కొన్నిరకాల అనారోగ్యంతో బాధపడేవారు దీనిని  రోజూ వినియోగించకూడదు.  

ఏమైనా ప్రతికూలతలు ఉన్నాయా?

తులసిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ గుణాలు లేనప్పటికీ.. కొన్నిరకాల అనారోగ్యంతో బాధపడేవారు దీనిని  రోజూ వినియోగించకూడదు.  

ఏమైనా ప్రతికూలతలు ఉన్నాయా?

గర్భధారణ సమయంలో తులసికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది గర్భాశయ సంకోచాలను ప్రేరేపిస్తుంది. తద్వారా అబార్షన్ ప్రమాదాన్ని పెంచుతుంది

గర్భధారణ సమయంలో 

తులసి అధిక రక్తపోటును నియంత్రించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. కనుక తులసి లో బీపీ ఉన్నవారు రోజు తీసుకోవద్దు. 

రక్తపోటుకు తులసి

డయాబెటిక్ మందులు లేదా కొలెస్ట్రాల్ నియంత్రణ మందులు తీసుకునే వ్యక్తులు తులసిని రోజూ తినకూడదు. తులసి వీరి ఆరోగ్యంపై దుష్ప్రభావాలను చూపిస్తుంది. 

డయాబెటిక్, కొలెస్ట్రాల్ 

ఎవరైనా తులసి ఆకులను నీటితో కలిపి మింగవచ్చు లేదా తులసి ఆకు కషాయాన్ని లేదా టీలో కలుపుకుని  తీసుకోవచ్చు. అంతేకాని డైరెక్ట్ గా తులసి ఆకులను నమిలి తినకూడదు.

తులసిని ఇలా తినకండి