దోమలకు ఈ బ్లడ్‌గ్రూప్ వారు దొరికితే పండుగే
19 December 2024
Ravi Kiran
దోమకాటు చాలా డేంజర్. దోమలు ఎన్నో వ్యాధులకు కారకాలు. కాబట్టి.. వీటిని ఇంట్లోకి రాకుండా చేయాలి.
వర్షాకాలంలోనే కాదు చలికాలంలో కూడా ఇంట్లోకి దోమలు, ఈగలు, ఇతర కీటకాలు ఎక్కువగా వస్తుంటాయి.
వీటివల్ల మనం ఎన్నో జబ్బుల బారిన పడాల్సి వస్తుంది..ముఖ్యంగా దోమలు రాత్రిపూట మనం నిద్రపోకుండా కుడుతూనే ఉంటాయి
ఇక మీకు ఓ విషయం తెలుసా.? చుట్టుప్రక్కల ఎంతమంది ఉన్నా కొందరినే దోమలు ఎక్కువగా కుడుతాయి.
ఇలా కుట్టడం వెనుక కొన్ని కారణాలు ఉన్నట్టు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మరి అవేంటో చూసేద్దాం.
శరీర ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నా, చెమట ఎక్కువగా పట్టినా దోమలు వారికీ ఎట్రాక్ట్ అవుతాయి.
మద్యపానం చేసేవారికి, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా విడుదల చేసేవారిని టార్గెట్ చేసి కుడతాయి.
నలుపు, ఆకుపచ్చ, ఊదా రంగు దుస్తులు ధరించిన వారిని అస్సలు వదలవు. ఇక O, AB బ్లడ్ గ్రూప్ వారు దొరికితే దోమలకు పండుగే.
ఇక్కడ క్లిక్ చెయ్యండి