దోమకాటులో కూడా సైన్స్ దాగి ఉందని మీకు తెలుసా.? తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. బీరు సేవించే వారిని దోమలు ఎక్కువగా కుట్టే అవకాశం ఉందని తేలింది.
దోమలు మనుషుల వైపు ఆకర్షితులవడానికి చాలా కారణాలున్నాయన్నారు అమెరికాలోని న్యూ మెక్సికో స్టేట్ యూనివర్శిటీలోని పబ్లిక్ హెల్త్ ప్రొఫెసర్ డాక్టర్ జగదీష్ ఖుబ్‌చందానీ.
ముఖ్యంగా శరీర వాసన, చర్మం ఉష్ణోగ్రతతో పాటు శరీరం నుంచి విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్, ఆల్కహాల్ కూడా కారణమవుతుందని తెలిపారు.
ఇదిలా ఉంటే మొత్తం 3500 కంటే ఎక్కువ జాతుల దోమలు ఉన్నాయి. అయితే మనిషిని కేవలం ఆడ దోమ మాత్రమే కుడుతుంది. దీనికి కారణం ఆడ దోమలకు వాటి గుడ్లకు ప్రోటీన్ అవసరం ఉంటుంది.
మనిషి రక్తం నుంచి దోమలకు ఈ ప్రోటీన్ లభిస్తుంది. ఇక ఏ బ్లడ్ గ్రూప్ ఉన్న వారిని దోమలు తక్కువగా కుడుతాయని పలు అధ్యయనాల్లో తేలింది. అలాగే ఓ బ్లెడ్ గ్రూప్ ఉన్న వారిని ఎక్కువగా కుడుతాయి.
అంతేకాకుండా బీరు తాగే వారికి కూడా దోమలు ఎక్కువగా కుడుతాయని తాజా అధ్యయనంలో తేలింది. ఇదండీ దోమ కుట్టడం వెనకాల ఉన్నఅసలు అర్థం.