రాత్రి నిద్రలో మాటిమాటికీ మెలకువ వస్తోందా? త్వరలోనే ఈ సమస్య..
January 05, 2024
TV9 Telugu
నిద్ర ఓ గొప్ప జీవరహస్యం.. మొక్కలతో సహా ప్రకృతిలో ప్రతి జీవి నిద్రపోతుందనే విషయం అందరికీ తెలిసిందే.. నేటి కాలంలో చాలా మంది కంటి నిండా నిద్రలేక సతమతమవుతున్నారు
అయితే ఎంత సేపు నిద్రపోయామన్నది కాదు.. నిద్ర ఎంత గాఢంగా నిద్రపోయామన్నది ముఖ్యమని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది
30 నుంచి 40 ఏండ్లు వయసున్న వ్యక్తుల నిద్రలో పదే పదే అంతరాయాలు ఉంటే అలాంటి వారికి వచ్చే పదేండ్లలో జ్ఞాపకశక్తి సమస్యలు తలెత్తుతాయని సైంటిస్టులు తేల్చారు
ముఖ్యంగా ఆలోచనా శక్తి, జ్ఞాపక శక్తి సమస్యలబారిన పడే అవకాశం వీరిలో ఎక్కువ అని సైంటిస్టుల పరిశోధనలో తేలింది
యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాన్‌ఫ్రాన్సిస్కో సైంటిస్టుల అధ్యయనంపై ‘జర్నల్ న్యూరాలజీ’ నివేదిక విడుదల చేసింది
‘అల్జీమర్స్ వ్యాధి లక్షణాలు బయటపడటానికి అనేక ఏండ్ల ముందే, మెదడులో వ్యాధి పేరుకుపోతున్నట్లు గుర్తించారు
నిద్రకు.. జ్ఞాపకశక్తికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకున్న తర్వాత.. వ్యాధులబారిన పడటాన్ని నిద్ర సమస్యలు మరింత పెంచుతోందని పరిశోధకులు తెలిపారు
మధ్య వయసున్న వారికి గాఢ నిద్ర చాలా అవసరమని, మెదడు తనను శుభ్రం చేసుకోవటానికి, తిరిగి కుదురుకోవటానికి నిద్ర చాలా అవసరమని వీరి పరిశోధనల్లో తేలింది