ఆరోగ్య సమస్యల్లో ఇదీ ఒకటి. దీని బారిన పడిన వారు దాన్నుంచి బయటపడడం అంత సులభం కాదు. ఆత్మహత్యకు దారి తీసే ముఖ్య కారణాల్లో డిప్రెషన్ ప్రధానమైనది
TV9 Telugu
భావోద్వేగాల్ని మీలోనే దాచుకుంటూ కుమిలిపోవద్దు. భయపెట్టే సంఘటనలు కావచ్చు.. ఇబ్బందులకు గురి చేసే పరిణామాలు కావచ్చు.. సమస్యలేవైనా.. అంతిమంగా భయపెట్టే బూచి డిప్రెషన్
TV9 Telugu
డిప్రెషన్ నుంచి బయటపడటంలో ఆహారం కీలకపాత్ర పోషిస్తుంది. శరీరానికి పని చేసే శక్తిని అందించడానికి, పోషకాహార లోపాలను పూరించడానికి కూడా ఆహారం అవసరం. కానీ ఏ ఆహారం మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుందో ఖచ్చితంగా తెలిపి ఉండాలి
TV9 Telugu
మానసిక అలసటను తగ్గించుకోవడానికి ఆహార నియమాలు పాటించాలి. జంక్ ఫుడ్ తింటే తీవ్రత అస్సలు తగ్గదు. కానీ ఆరోగ్యమైన తినడం ద్వారా మానసిక ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది
TV9 Telugu
ఈ టైంలో బిర్యానీ, ఐస్‌క్రీం తినడం అస్సలు మంచిది కాదు. కొన్ని ఆహారాలు ఉన్నాయి.. ఇవి మనస్సును సంతోషపరుస్తాయి. చిలగడ దుంపలలో ఎల్-ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. చిలగడ దుంపలు ఆందోళనను తగ్గించడంలో సహాయపడతాయి
TV9 Telugu
అరటిపండు తినడం వల్ల శరీరానికి పని చేసే శక్తి ఉంటుంది. మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అరటిపండు రక్తపోటును అదుపులో ఉంచుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది
TV9 Telugu
అవిసె గింజలు, చియా విత్తనాలు వంటి సీడ్స్ కూడా ఆందోళనను తగ్గిస్తాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే విత్తనాలు డిప్రెషన్‌కు విరుగుడుగా ఉంటాయి.
TV9 Telugu
బాదం, జీడిపప్పు, హాజెల్ నట్స్, వాల్ నట్స్ వంటి నట్స్ లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇది ఉపయోగపడుతుంది. అలాగే మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ బ్లూబెర్రీస్ తినాలి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి