ఆ రోజుల్లో లడ్డూలు స్వీట్ కోసం తయారు చేయలేదని మీకు తెలుసా?
TV9 Telugu
16 October 2024
బూందీని లడ్డూగా మార్చే ముందు వాటికి ఇంకా రుచి వచ్చేందుకు యాలక్కాయలు, ఎండుద్రాక్షలు, జీడిపప్పు లాంటివి చేరుస్తారు.
భారతదేశంలో స్వీట్స్ పేరుతో అత్యంత ప్రాచుర్యం పొందినది లడ్డూ పిల్లల నుంచి పెద్దలవరకు చాలా ఇష్టంగా తింటారు.
ప్రస్తుతం చాలా రకాల లడ్డూలు తయారు చేస్తున్నారు. వాటిలో మోతీచూర్ లడ్డూలు, బేసన్ లడ్డూలు, బూందీ లడ్డూలు చాలా ఇష్టపడతారు.
అయితే ఈ రుచికరమైన లడ్డూలను మొదట తాయరు చేసింది స్వీట్ కోసం కాదు. మరి దేని కోసమే ఇప్పుడు తెల్సుకుందాం రండి.
అవును ఇది నిజం. లడ్డును స్వీట్ కోసం కాదు మొదట వైద్య ఉపయోగం కోసం తయారు చేశారు. దీని చరిత్రను మనం ఇక్కడ తెలుసుకుందాం..
నిపుణుల అభిప్రాయం ప్రకారం లడ్డూ క్రీ.పూ.300-500 నాటికే భారతదేశంలో కనిపెట్టబడిందని అధ్యయనల ద్వారా తెలుస్తోంది.
అయితే దీన్ని తీపిలాగా కాకుండా వ్యాధిని నయం చేసేందుకు తయారు చేశారు. దీనిని భారతదేశపు గొప్ప వైద్యుడు సుశ్రుతుడు కనుగొన్నాడని చెబుతారు.
వాస్తవానికి, సుశ్రుత్ లడ్డూలను తయారు చేసింది.. స్వీట్స్ కాదు.. ఈ లడ్డుతో అతను రోగులకు చేదు మందులను ఇచేందుకు ఉపయోగించాడు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి