అయోధ్య గుండా ప్రవహించే నది ఏదీ..?
TV9 Telugu
20 January 2024
భారతదేశంలోని పురాతన నదులలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య సమీపంలో ప్రవహించే ఆహ్లాదకరమైన సరయూ నది ఒకటి.
చారిత్రక, పౌరాణిక నేపథ్యం ఉన్న అయోధ్య నగరాన్ని సందర్శించేవారికి మరో చక్కని ప్రయాణ అనుభూతి ఈ సరయూ నది.
సరయూ బ్రహ్మసర్ అని కూడా పిలువబడే మానస సరోవరం నుండి ఉద్భవించింది.దీనిని ఘఘ్రా, సర్జు, శారదా అని కూడా పిలుస్తారు.
భూలోక స్వర్గంలా తలపించే హిమాలయాల నుండి ఉద్భవించి ఉత్తర భారతదేశంలోని గంగా మైదానంలో సరయూ నది ప్రవహిస్తుంది.
అయోధ్య మీదుగా బల్లియా, ఛప్రా మధ్య గంగలో కలుస్తుంది సరయూ నది. సరయూ నదిని ఎగువ భాగంలో కాళీ నది అని పిలుస్తారు.
ఉత్తరాఖండ్ రాష్ట్రం, నేపాల్ దేశం మధ్య చాలా దూరం వరకు సరిహద్దుగా ఈ పురాతన సరయూ నది నిత్యం ప్రవహిస్తుంది.
రామాయణ కాలంలో ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కోసల జిల్లాలో ప్రధాన నదిగా ప్రఖ్యాతి గాంచింది ఈ సరయూ నది.
ఋగ్వేదంలో కూడా సరయూ నది ప్రస్తావన ఉందని అనేక భారతీయ ఇతిహాసాలు, పురాణాలు, గ్రంధాలు కూడా చెబుతున్నాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి