సక్సెస్ సంబరాల్లో సలార్ టీం.. జపాన్ లో విడుదలకు సిద్ధం..
TV9 Telugu
16 January 2024
ఈ భూమి మీద పర్యాటకులు వెళ్లాలని ఉన్నా వెళ్లలేని దీవి ఒకటుంది. అదే అట్లాంటిక్ మహా సముద్రంలో స్నేక్ ఐలాండ్.
బ్రెజిల్ పక్కన అట్లాంటిక్ మహా సముద్రంలోని సర్పాల దీవికి హైప్ ఎక్కువ. దీన్ని అధికారికంగా ఇల్హా డా క్వీమాడా గ్రాండే అంటారు.
బ్రెజిల్ దేశంలో సావోపాలో రాష్ట్రంలోని ఇటాన్‌హేమ్ మున్సిపాలిటీ పరధిలోని ఈ దీవి విస్తీర్ణం 106 ఎకరాలు.
మన దేశ వాతావరణం లాగానే ఉండే ఈ ప్రాంతానికి వెళ్లి చూద్దామంటే బ్రెజిల్ ప్రభుత్వం అస్సలు పర్మిషన్ ఇవ్వదు.
అత్యంత అరుదైన, అంతరించే జాతులకు చెందిన బోత్‌రాప్స్ ఇన్సులారిస్ అనే బంగారు తల ఉన్న విషపూరిత పాములకు ఈ దీవి ప్రసిద్ధి.
అందమైన దీవి అది. కానీ దీవి మొత్తం పాముల మయం. చిన్న దీవే అయినా వేల కొద్దీ సర్పాలున్నాయి. వాటిలో చాలా వరకూ విషపూరితమైనవే.
అందువల్ల అక్కడికి వెళ్లిన వారు ప్రాణాలతో తిరిగి వస్తారనే గ్యారెంటీ లేదట. పాము కాటేస్తే... అక్కడి నుంచి బ్రెజిల్‌కి వచ్చేలోపే చనిపోయే అవకాశాలు ఎక్కువ.
కొంతమంది పాముల్ని చంపేస్తుంటారు. కనీసం ఆ దీవిలోనైనా పాములకు రక్షణ ఉండాలని బ్రెజిల్ ప్రభుత్వం భావించింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి