ప్రేమ.. డేటింగ్‌లో ఉన్నారా? ఈ విషయాలు తెలుసుకోండి..
6 September 2023
ఆకర్షణో, అర్ధంలేని అమాయక తనమో తెలియదు గానీ ఈ రోజుల్లో ప్రేమ, డేటింగ్, బ్రేకప్ చాలా కమన్ అయిపోయింది. ఈ పోకడ నేటి యువతలో కొన్ని విషయాల్లో గుడ్ మెమరీస్ పంచినప్పటికీ.. మరికొన్ని సందర్భాల్లో అంతులేని అవేదన మిగుల్చుతోంది
ఇద్దరి మధ్య తలెత్తే భిన్నాభిప్రాయాలు.. అసూయాద్వేషాలు, అపార్థాలకు కారణమై అనుకోని గొడవలు తలెత్తి విడిపోతుంటారు. దీని వల్ల ఇద్దరూ మానసికంగానూ డిస్టర్బ్ అవుతుంటారు.
ఒక్కోసారి ప్రేమ విషలమై ఆ బాధ మరువలేక కఠిన నిర్ణయాలు తీసుకుని జీవితానికి ముగింపు పలుకుతుంటారు. ఇటీవల ఇటువంటి సంఘటనలు ఎన్నో చూశాం
అలా జరగకుండా ఉండాలంటే ప్రేమ లేదా డేటింగ్‌లో ఉన్నప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవలంటున్నారు నిపుణులు.
టీనేజ్ లేదా యుక్త వయసులో ఉన్నప్పుడు సాదారణంగా ఎదుటి వ్యక్తిపై కలిగే ఆకర్షణకు ప్రేమ అనే పేరు పెట్టేస్తుంటారు. తొలినాళ్లలో ఒకరిని విడిచిమరొకరు ఉండలేమన్నట్లు ప్రవర్తిస్తుంటారు
నిజానికి ఆ వ్యక్తిపై ప్రేమ ఉంటే ఎందురుగా ఉన్నప్పుడే కాదు దూరంగా ఉన్న వారి ప్రేమలో ఎటువంటి మార్పు కనిపించదు. అందుకే మీది నిజమైన ప్రేమో కాదో తెలుసుకోవాలంటే కొన్నాళ్లు ఇద్దరూ ఒకరికొకరు దూరంగా ఉండాలి
ఇలా చేయడం వల్ల ఎదుంటి వ్యక్తిపై మీకున్నదిప్రేమా? లేదా ఆకర్షణా? అన్న విషయం స్పష్టమైపోతుంది. అప్పుడు అది నిజమైన బంధంగా మారి అనుబంధానికి దారి తీస్తుంది
అలాగే ఒకరి ఆలోచనలకు, అభిప్రాయాలకు మరొకరు విలువ ఇస్తేనే ఏ బంధమైనా నిలబడుతుంది. కానీ ఒక్కోసారి అవతలి వ్యక్తికి మీ ఆనోలచనలు, చర్యలు సుతారం నచ్చదు. డేటింగ్ ఉన్నప్పుడే ఇలాంటి లక్షణాలు కన్పిస్తే ఆ బంధానికి వెంటనే స్వస్తి పలకాలి