అమ్మో.. లిప్‌స్టిక్‌ మీరూ వేస్తున్నారా? ఇది తెలుసుకోండి

April 03, 2024

TV9 Telugu

ఎంత అందంగా మేకప్‌ వేసుకున్నా.. అదరాలకు సరైన లిప్‌స్టిక్‌ వేసుకోకపోతే ఏదో వెలితిగా అనిపిస్తుంది. అయితే వీటిని చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకోవంటున్నారు నిపుణులు

లిప్‌స్టిక్‌ వేసుకుంటే చుక్కల్లో చందమామలా మెరిసిపోవచ్చు. అందుకే అధరాలు అందంగా కనపడేందుకు ప్రతి అమ్మాయి లిప్‌స్టిక్‌ వేసుకుని మురిసిపోతుంది

అయితే ఎంతో ముచ్చటపడి వేసుకున్న లిప్‌స్టిక్‌ పెదాలపై ఎక్కువ సేపు నిలవదు. కాసేపటికే లిప్‌స్టిక్‌ పోతుంది. అదంతా ఆవిరైపోతుందని అనుకుంటే పప్పులో కాలేసినట్లే

మరేమైపోతుంది ఆ లిప్‌స్టిక్‌ అంతా అంటే... మనకే తెలియకుండా పెదాలకు వేసుకన్న లిప్‌స్టిక్‌ నోట్లోకి వెళ్లిపోతుందట. ఇలా ఒక మహిళ తన జీవితకాలంలో దాదాపు 1.8 కేజీల లిప్‌స్టిక్‌ని తనకి తెలియకుండానే తినేస్తుందట

తాజా అధ్యయనాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. నోట్లోకి వెళ్లే లిప్‌స్టిక్‌ మోతాదుల్లో తేడా ఉంటే ఉండొచ్చు కానీ అది శరీరం లోపలికి ప్రవేశించని తర్వాత దాని ప్రభావం అందరి మీదా ఒకేలా పడుతోంది

ఎందుకంటే లిప్‌స్టిక్‌ తయారీలో హానికర లోహాలు, పారాబెన్‌లు, రసాయనాలు అధికంగా వినియోగిస్తారు. అవి రక్తంలో కలిసిపోయి ప్రాణాంతక వ్యాధులకు దారి తీస్తాయి

దీంతో మహిళల నుంచి ఆ వ్యాధులు వాళ్ల పిల్లలకు కూడా సంక్రమిస్తాయి. దీనిపై కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన కొందరు నిపుణులు 30 మంది యువతులపై అధ్యయనం చేశారు

వారి రక్తంలో అత్యధికం మోతాదులో లోహాలు ఉన్నట్టు గుర్తించారు. లిప్‌స్టిక్‌ని సగటున రోజుకి రెండు సార్లు వాడటం వల్ల 24 మిల్లీగ్రాముల లోహాలు రక్తంలో కలుస్తున్నాయని తెలిపారు. అందుకే లిప్‌స్టిక్‌ వేసుకునే ముందు కాస్త ఆలోచించాలని చెబుతున్నారు