రోజుకి రెండు ఖర్జూరాలు తింటే ఏమౌతుందో తెలుసా..?

Jyothi Gadda

27 October 2024

ఖర్జూరంలో ఐరన్, మినరల్స్, కాల్షియం, అమినో యాసిడ్స్, ఫాస్పరస్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. శరీరాన్ని చక్కగా ఉంచి అందాన్ని పెంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

డ్రై ఫ్రూట్స్ లో ఖర్జూరానికి ప్రత్యేక స్థానం. ఈ ఖర్జూరాన్ని తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనల్లో తేలింది. ఎండు ఖర్జూరంలో క్యాలరీల శాతం కాస్త ఎక్కువగానే ఉంటుంది.

ఎప్పుడైనా శక్తి కోల్పోయినట్లు, నీరసంగా అనిపిస్తే ఒక్క ఖర్జూరం తిన్న వెంటనే ఎనర్జీ వచ్చిన అనుభూతి కలుగుతుంది. ఖర్జూరంలోని క్యాలరీలలో ఎక్కువ భాగం కార్బో హైడ్రేట్స్ నుంచే వస్తుంది.

ఖర్జూరంలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు మాత్రం పుష్కలంగా ఉంటాయి. మీ మొత్తం ఆరోగ్యానికి తగినంత ఫైబర్ తీసుకోవడం చాలా ముఖ్యం. ఫైబర్ ఎక్కువగా తీసుకోవాలంటే ఖర్జూరం బెస్ట్‌. 

మలబద్ధకాన్ని నివారించడం ద్వారా ఫైబర్ మీ జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది మల విసర్జనకు సహాయపడుతుంది కాబట్టి ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది.

ఖర్జూరాలు వివిధ రకాల యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. 

ఖర్జూరంలోని యాంటీఆక్సిడెంట్లు మీ కణాలను ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. అంజీరా,  బాదం వంటి ఇతర పండ్లతో పోలిస్తే, ఖర్జూరంలో అధిక యాంటీఆక్సిడెంట్ కంటెంట్ ఉంటుంది.

గర్భిణీ స్త్రీలకు సుఖ ప్రసవం అయ్యేలా చేసే శక్తి ఖర్జూరానికి ఉందంటారు. గర్భధారణ చివరి వారాల్లో ఈ పండ్లను తినడం వల్ల సిజేరియన్ అవసరాన్ని తగ్గిస్తుందని నమ్ముతారు.