మీది ఉంగరాల జుట్టా..? వేసవిలో ఈ జాగ్రత్తలు తీసుకోండి

March 24, 2024

TV9 Telugu

జుట్టు సిల్కీగా ఉన్న వారికి కర్లీగా.. అదే కర్లీ హెయిర్‌ ఉన్న వాళ్లు సిల్కీగా కావాలని కోరుకుంటారు. ఎవరి జుట్టు తత్వం వారికి ఒక పట్టాన నచ్చదు. హెయిర్‌ ఉన్న వాళ్లు మాత్రం ఈ చింపిరి జుట్టు నా వల్ల కాదు బాబోయ్‌..’ అంటూ గగ్గోలు పెడుతుంటారు

కర్లీ హెయిర్‌ ఉన్న వాళ్లు ఇలా చికాకు పడటానికి కారణం లేకపోలేదు. ఎందుకంటే ఉంగరాల జుట్టు సాధారణంగానే పొడిగా ఉంటుంది.. అలాంటిది వేసవి సీజన్‌లో వాతావరణంలో వేడి పెరిగే కొద్దీ హ్యుమిడిటీ కూడా పెరిగి మరింత పొడిబారుతుంది

అందుకే కర్లీ హెయిర్ ఉన్న వారు వేసవిలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు సౌందర్య నిపుణులు. వారానికి ఒకట్రెండుసార్లకు మించి తలస్నానం చేసినా జుట్టు పొడిబారుతుందని చెబుతున్నారు

మరిముఖ్యంగా గాఢత తక్కువగా ఉండే షాంపూని నీళ్లలో కలుపుకొని తలస్నానం చేయడం మంచిదట. తలస్నానం తర్వాత నాణ్యమైన కండిషనర్‌ను రాసుకోవడం అస్సలు మర్చిపోకూడదు

అలాగే తలస్నానానికి వేడి నీళ్లు కాకుండా గోరువెచ్చటి లేదంటే చల్లటి నీళ్లు ఉపయోగించడం మంచిది. వేసవిలో కర్లీ హెయిర్‌ సంరక్షణ కోసం వారానికి మూడుసార్లు నూనె పెట్టుకోవడం తప్పనిసరి

కొబ్బరి నూనెను కుదుళ్లు, వెంట్రుకలకు అప్లై చేసి కాసేపు మర్దన చేయాలి. ఇలా నూనె పెట్టుకున్న మరుసటి రోజు తలస్నానం చేయాలి. తడిగా ఉన్న జుట్టును దువ్వడం, టవల్‌తో గట్టిగా రుద్దుతూ తుడవడం, డ్రయర్‌తో ఆరబెట్టడం వంటివి అస్సలు చేయకూడదు

ఎందుకంటే ఇవి జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. మెత్తటి కాటన్‌ బట్టతో జుట్టును పొడిగా తుడుచుకొని, ఆరిన తర్వాత దువ్వెనతో చిక్కు తీసుకోవాలి. తడిగా ఉన్న కర్లీ హెయిర్‌ను బిగుతుగా జడ వేసుకోవడం లేదంటే ముడేయడం.. వంటివి చేస్తే జుట్టు చివర్లు చిట్లిపోతాయి

ఎండ వల్ల కర్లీ హెయిర్‌ పాడవకుండా ఉండాలంటే షియా బటర్‌, నువ్వుల నూనె.. వంటివి ఉపయోగించి తయారుచేసిన హెయిర్‌కేర్‌ ఉత్పత్తుల్ని ఉపయోగించాలి. బయటికి వెళ్లినప్పుడు జుట్టుకు ఎండ తగలకుండా క్యాప్‌/స్కార్ఫ్‌తో కవర్‌ చేసుకోవాలి