కప్పు పెరుగులో నాలుగు ఎండుద్రాక్షలు కలిపి తింటే..

02 September 2023

పెరుగులో కాల్షియం, విటమిన్ బి2, పొటాషియం, మెగ్నీషియం వంటి అనేక ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పెరుగు ఒక అద్భుతమైన ప్రోబయోటిక్. 

పెరుగుతో ఎండు ద్రాక్ష కలిపి తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రోజూ మీ ఆహారంలో పెరుగును చేర్చుకోవడం వల్ల జీర్ణక్రియను మెరుగుపడుతుంది

కడుపు సంబంధిత సమస్యలను తగ్గించడంలో పొట్ట, ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో పెరుగులోని మంచి బ్యాక్టీరియా సహాయపడుతుంది. 

ఐతే రోజూ కప్పు పెరుగులో మూడు లేదా నాలుగు ఎండు ద్రాక్షలను కలుపుకుని తింటే ఎంతో మేలు జరుగుతుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. 

ఎండుద్రాక్షల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న డ్రై ఫ్రూట్. ఎండుద్రాక్షలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మలబద్ధకాన్ని నివారించి, జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది

పెరుగులో ఎండుద్రాక్షలను కలిపి తినడం వల్ల జీర్ణవ్యవస్థను అడ్డుకునే అన్ని చెడు బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. జీర్ణ సమస్యలు, మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడేవారు పెరుగులో ఎండు ద్రాక్షను కలుపుకుంటే మంచిది.

అలాగే ఎండుద్రాక్షలను పెరుగులో కలిపి తింటే వీటిల్లోని కాల్షియం ఎముకలను బలోపేతం చేయడానికి, ఎముకల సాంద్రతను పెంచడానికి సహాయపడతాయి

నోట్లోని చిగుళ్లు, దంతాలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఇది కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో, బీపీని తగ్గించడంలో, బరువు తగ్గడంలో సహాయపడతాయి