ఈ జీవులు ఆహారం, నీరు లేకుండా నెలల తరబడి జీవించగలవు!
TV9 Telugu
18 Febraury 2024
ఎడారి ప్రాంతాల్లో కనిపించే ఒంటెలు వారాల పాటు ఆహారం తీసుకోకుండా, అలాగే నీరు లేకుండా ఆరు నెలలు జీవించగలదు.
తేనెటీగలు తమ శరీరాలపై తయారు చేసిన తేనెగూడులో తేనెను నిల్వ చేసుకుంటాయి. చలికాలం సమయంలో ఇదే వాటికి ఆహారం.
శీతాకాలంలో చలి కారణంగా తేనెటీగలు నెలల తరబడి మేత దొరకవు. ఈ సమయంలో రాణి తేనెటీగ తన గూడు నుండి బయటకు రాదు.
ఎడారి తాబేలు దాదాపు 50 నుండి 80 సంవత్సరాల వరకు జీవించగలదు. ఇవి 4 డిగ్రీల సెల్సియస్ - 60 డిగ్రీల సెల్సియస్ మధ్య జీవించగలవు.
ఎడారి తాబేలు తమ మూత్రాశయంలో నీటిని సేకరిస్తాయి. ఈ నీటిని శక్తిగా మార్చడం ద్వారా నెలల తరబడి తమ ఆహార అవసరాలను తీర్చుకుంటాయి.
ఆఫ్రికన్ లంగ్ ఫిష్ మంచినీటి చిత్తడి నేలలు , చిన్న నదులలో కనిపిస్తుంది. ఈ చేప చాలా కాలం పాటు నీటిలో ఏమీ తినకుండా, తాగకుండా ఉంటుంది.
హెలోడెర్మా చాలా విషపూరితమైన బల్లులు. వాటిలో కొవ్వు నిల్వలు ఉంటాయి. అవి ఏమీ తినకుండా, త్రాగకుండా నెలల తరబడి జీవించగలవు.
కొమోడో డ్రాగన్ అరణ్యాలలో క్రూరమైన వేటాడే జంతువులలో ఒకటి. వాటి నోటి నుండి వెలువడే లాలాజలంలో భయంకరమైన విషం కనిపిస్తుంది.
ఒక జింక, పంది తల, సగం మేకను కొమోడో డ్రాగన్ ఒకేసారి మింగగలదు. దీంతో ఈ జీవి నెలల తరబడి తినకుండా ఉండగలదు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి