కోవిడ్ 19 వ్యాప్తి నిరోధానికి రోగనిరోధక శక్తిని ఎలా పెంచుకోవాలంటే.. 

21 December 2023

కరోనా వైరస్ మరోసారి విజృంభించడం మొదలు పెట్టింది. ఇటీవల కరోనా కొత్త వేరియంట్  JN.1  ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలను సృష్టిస్తోంది. 

JN.1 వేరియంట్‌

ఇంతకుముందు చైనా, అమెరికా, సింగపూర్‌ సహా పలు దేశాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పుడు భారతదేశంలో కూడా ఈ వేరియంట్ కేసులు వెలుగులోకి వచ్చాయి

భారత్‌ అప్రమత్తం

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం కరోనాను నివారించడానికి మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం చాలా ముఖ్యం. కనుక రోగనిరోధక శక్తిని పెంచుకోమని సూచిస్తున్నారు

రోగనిరోధక శక్తి

పసుపులో ఉండే కర్కుమిన్ యాంటీ ఆక్సిడెంట్లను పెంచుతుంది. రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు రోజూ పసుపు పాలు తాగండి

పసుపు పాలు

మంచి నిద్ర సహజమైన రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. కనుక రోజూ కనీసం 8 గంటలు నిద్రపోవాలి. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది

సరిపడే నిద్ర

శతాబ్దాలుగా తులసిని ఆయుర్వేద ఔషధంగా ఉపయోగిస్తున్నారు. రోగనిరోధక శక్తిని పెంచడానికి తులసి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

తులసి

సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఈ విటమిన్ వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నారింజ, నిమ్మ, ద్రాక్షలను తినే ఆహారంలో చేర్చుకోవాలి

విటమిన్ సీ