చెవిలో ఇయర్ బడ్స్‌‌ పెట్టి తిప్పుతున్నారా  ?? అయితే అది పోవడం ఖాయం

TV9 Telugu

05 June 2024

చెవిలోని గులిమి అని కొంతమంది.. చెవి దురద పుడుతుందని కొంతమంది ఎక్కువగా చెవిలో కాటన్ బడ్స్ ఉపయోగిస్తుంటారు.

ఇయర్ బడ్స్ ఉపయోగించేటప్పుడు బాగున్నట్లు అనిపించినా.. దీన్ని వినియోగించటం వల్ల అనేక ప్రమాదాలకు దారితీస్తాయి.

కాటన్ బడ్స్‌ను వినియోగించడం వల్ల తీవ్రమైన నొప్పి మరియు వినికిడి లోపంతో సహా వివిధ చెవి సమస్యలకు దారితీస్తుందని నివేదికలు చెపుతున్నాయి.

చెవిలో గులిమి సహజంగానే శుభ్రపరుస్తుంది. అయితే కాటన్ బడ్స్‌ను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల మీ చెవులు కింద ఉన్న సహజ డ్రమ్ దెబ్బతింటుంది.

చెవిలో దూది పెట్టి తిప్పడం వల్ల సున్నితమైన చర్మంపై గీతలు పడే ప్రమాదం ఉందని హియర్ క్లియర్ సీనియర్ ఇఎన్‌టి కన్సల్టెంట్ డాక్టర్ సంజయ్ సచ్‌దేవా చెప్పారు.

కాటన్ ఇయర్ బడ్స్ కు బ్యాక్టీరియా మరియు జెర్మ్స్‌తో నిండి ఉంటాయి.. వీటిని చెవిలో పెట్టుకువడం వల్ల చెవి ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. 

చెవులలో ఏదైనా అసౌకర్యం, నొప్పి లేదా వినికిడి లోపం అనుభవిస్తే.. వైద్యుడిని సంప్రదించాలి అంతేకాని ఇలాంటివి వాడకూడదు.