ఇంట్లో కూర్చొని ఆధార్ కార్డులో పుట్టిన తేదీని సరి చేసుకోవచ్చు
TV9 Telugu
22 April 2024
ముఖ్యంగా పుట్టిన తేదీని ఒకసారి మాత్రమే మార్చుకోవడానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) అనుమతిస్తోంది.
అదీ కూడా ఆధార్ తొలిసారి తీసుకున్న సమయంలో ఉన్న తేదీకి మూడు సంవత్సరాలు అటూఇటూ మాత్రమే మార్చే అవకాశం ఉంది.
ఆధార్ నమోదు సమయంలో పుట్టిన తేదీకి సంబంధించి ఎలాంటి పత్రాలు రుజువుగా సమర్పించనట్లయితే.. దాన్ని ‘డిక్లేర్డ్’ లేదా ‘అప్రాగ్జిమేట్’గా పేర్కొంటారు.
పుట్టిన తేదీని మరచడానికి ముందుగా https://myaadhaar.uidai.gov.in/ అనే అఫీషియల్ వెబ్సైట్ లో లాగిన్ అవ్వండి.
లాగిన్ చేయడానికి ముందు, ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి OTPపై క్లిక్ చేయండి. మొబైల్ నంబర్‌కు వచ్చిన OTP నమోదు చేయండి.
OTPని నమోదు చేసిన తర్వాత, లాగిన్‌పై క్లిక్ చేసి, అప్‌డేట్ ఆధార్ ఆన్‌లైన్‌ని ఎంచుకుని, పుట్టిన తేదీని మార్చండి.
మీరు ఆన్‌లైన్ ద్వారా పుట్టిన తేదీ, లింగం, భాష, చిరునామాలలో దిద్దుబాట్లు చేయవచ్చు. ఆ తర్వాత అప్‌డేట్‌కు కొనసాగండిపై క్లిక్ చేయండి.
కనిపించే ఆప్షన్‌లో పుట్టిన తేదీని క్లిక్ చేసి ఒరిజినల్ పుట్టిన తేదీ డాక్యుమెంట్ స్కాన్ చేసిన కాపీని అప్‌లోడ్ చేసి, ఆన్‌లైన్ అప్‌డేట్ కోసం, రూ. 50 చెల్లించాల్సి ఉంటుంది.