కిడ్నీలో రాళ్లా? మొక్కజొన్నపీచుతో ఇలా చేయండి..
28 December 202
3
రక్తంలో ఉండే మలినాలను మూత్రపిండాలు బయటకు పంపిస్తాయి. అయితే మలినాలు ఎక్కువైతే కిడ్నీలో రాళ్లు చేరుతాయి.
యూరిన్‌లో క్యాల్షియం, పొటాషియం, సోడియం వంటి పదార్థాలు ఎక్కువైతే.. కిడ్నీలో చిన్న చిన్న రాళ్లుగా మారుతాయి. ఇవి క్రమంగా పెద్దవి అవుతాయి.
అయితే మొక్క జొన్న పీచును నీటిలో మరిగించి దానిని టీగా తీసుకుంటే ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు.
మొక్క జొన్న పీచుతో తయారు చేసే టీని తాగితే యూరిన్ ఇన్ఫెక్షన్ నయం అవుతుంది. అలాగే మలినాలు తగ్గుతాయి.
అంతేకాకుండా మొక్క జొన్న పీచును తీసుకుంటే కిడ్నీలో రాళ్లు రాకుండా అడ్డుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇది రాళ్లు కరగడంలో ఉపయోగపడుతుంది.
మొక్కజొన్న పీచు తీసుకోవడం వల్ల డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్‌కు ఇది దివ్కౌషధంగా ఉపయోగపడుతుంది.
అధిక బరువు సమస్యతో బాధపడే వారు కూడా మొక్క జొన్న పీచుతో చేసిన రసాన్ని తీసుకుంటే మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యం విషయంలో వైద్యుల సూచనలుపాటించడమే ఉత్తమం.
ఇక్కడ క్లిక్ చేయండి..