ఇవి పాలలో కలుపుకొని తాగితే బెనిఫిట్స్ డబుల్..
TV9 Telugu
13 June 2024
రాత్రిపూట చాలా మంది ప్రజలు కచ్చితంగా పాలు తాగి నిద్రపోతారు. పాలలో కాల్షియం, విటమిన్ డి, విటమిన్ బి, ప్రొటీన్లు ఉంటాయి.
బాదంపప్పును పాలలో కలుపుకుని తాగడం వల్ల శరీరానికి ఎక్కువ పోషకాలు అందుతాయి. ఎదిగే పిల్లలకు బాదంపప్పు పొడిని పాలలో కలిపి ఇవ్వవచ్చు.
బాదం పాలు తయారు చేయడానికి, 1 గ్లాసు పాలు తీసుకొని 5-6 బాదంపప్పులను మెత్తగా చేసి అందులో వేసి బాగా మరిగించి కొంచెం పంచదార వేసి చల్లారిన తర్వాత తాగాలి.
కరోనా నాటినుంచి అందరూ డాక్టర్లు గోల్డెన్ మిల్క్ తాగమని సిఫార్సు చేస్తున్నారు. గోల్డెన్ పాలు అంటే పసుపు పాలు.
పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. పసుపు పాలు శరీరాన్ని వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతాయి.
పసుపు పాల కోసం, 1 గ్లాసు పాలు, కొంచెం పసుపు పొడి కలిపి బాగా మరిగించాలి. అనంతరం గోరువెచ్చని పాలను తాగాలి.
దాల్చిన చెక్క రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఖచ్చితంగా దాల్చిన చెక్కను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.
ఇది మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. 1 గ్లాసు పాలను మరిగించి, దాల్చిన చెక్క పొడి కలుపుకొని గోరువెచ్చగా తాగాలి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి