ఈ ఆలయ నిర్మాణం నేటికీ ఓ మిస్టరీ.!

TV9 Telugu

24 August 2024

మహారాష్ట్రలోని ఔరంగబాద్‌కు సమీపంలోని కైలాస టెంపుల్ ఇటుకలతోనూ రాళ్ళతోనూ కట్టిన కట్టడం కాదు పూర్తిగా ఒక కొండను తొలచి ఆలయంగా నిర్మించారు.

ఎల్లోరా గుహలలో ఒకటైన ఈ ఆలయం నిర్మించడానికి మొత్తం 4 లక్షల టన్నుల రాతిని తొలిచారు. కేవలం 18 ఏళ్లలో కొండను గుడిగా మలిచారు.

ఆలయానికి కావలసిన ఆకారం ఇస్తూ రాయిని తొలగించాలి. మరి ఇంతటి గొప్ప ఆలయాన్ని అప్పట్లో ఎలా నిర్మించారో నిర్మించిన వారికే తెలియాలి.

ఈ కైలాస టెంపుల్ మరో ప్రత్యేకత ఆకాశం నుంచి చూస్తే.. ఎక్స్ ఆకారం లో ఉంటుంది. భూమి మీద నుంచి చూస్తే.. 4 సింహాలు ఎక్స్ (X) ఆకారంలో నిలుచున్నట్లు కనిపిస్తుంది.

ఈ ఆలయ నిర్మాణంలోనే వాటర్ హార్వెస్టింగ్, డ్రైనేజ్ వ్యవస్థ, రహస్య మార్గాలు, బాల్కనీలు, అప్ స్టైర్స్ వంటి ఎన్నో అద్భుతాలను రాయిని మలచి చెక్కారు.

ఈ ఆలయంలో ఉన్న శివలింగంపై పోసే నీళ్లు ఎక్కడికి వెళ్తాయో ఎవరికీ తెలియదు. అయితే ఆలయం కింద ఉన్న అండర్ గ్రౌండ్ సిటీలోకి వెళ్తాయనే సందేహాలు ఉన్నాయి.

1680 లో ఔరంగజేబు 1000 మంది కూలీలతో ఈ కైలాసాలయాన్ని ధ్వంసం చేయాలని 3 ఏళ్ళు పాటు కష్టపడి విఫలం అయ్యాడు.

ఈ ఆలయం ఎల్లోరా గుహల్లో ఓ ప్రత్యేక ఆకర్షణ. దీన్ని చూడ్డానికి ఏటా చాలామంది పర్యాటకులు ఎల్లోరాకి వస్తారు.