మల బద్ధకంతో గుండెపోటు.. 

Narender Vaitla

27 Aug 2024

ప్రస్తుతం గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మారిన జీవిన విధానం, తీసుకునే ఆహారంలో మార్పుల కారణంగా ఈ సమస్య బారిన పడుతోన్న వారి సంఖ్య ఎక్కువుతోంది.

గుండె సంబంధిత సమస్యలు రావడానికి స్మోకింగ్‌, మద్యం సేవించడం, అధిక రక్తపోటు, ఊబకాయం వంటివి కారణలమని తెలిసిందే. అయితే మల బద్ధకం కూడా గుండెపోటుకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

గుండె వైఫల్యం వంటి తీవ్ర సమస్యలకు మలబద్ధకానికి మధ్య సంబంధం ఉన్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది. తాజాగా నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 

మలబద్ధకం గుండెపోటుకు కారణమవుతుందని ఆస్ట్రేలియాలోని మోనాష్‌ యూనివర్సిటీ  అధ్యయనంలో తేలింది. ఇందుకోసం 4 లక్షలకుపైగా మందిని పరిగణలోకి తీసుకున్నారు.

వీరిపై పరిశోధనలు చేసిన తర్వాత.. మలబద్ధకం లేనివారితో పోలిస్తే, ఉన్నవారికి తీవ్ర గుండెజబ్బు వచ్చే అవకాశం రెట్టింపవుతున్నట్టు గుర్తించారు.

మలబద్ధకంతో పాటు, అధిక రక్తపోటుతో కూడా బాధపడేవారిలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుందని పరిశోధనల్లో వెల్లడైంది. గుండెజబ్బు, మలబద్ధకం మధ్య జన్యుపరమైన సంబంధాలు కూడా ఉంటున్నాయని పరిశోధకులు గుర్తించారు.

గుండె ఆరోగ్యానికి పేగుల ఆరోగ్యంపై కూడా దృష్టి సారించాల్సిన అవసరముందని పరిశోధకులు సూచిస్తున్నారు. కాబట్టి మలబద్ధకం సమస్య ఉంటే వైద్యులను సంప్రదించడం మంచిది

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.