ముప్పైల్లోకి అడుగు పెట్టారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి
19 October 2023
ముప్పైల్లోకి అడుగు పెట్టాక ముఖంలో మార్పులు ప్రారంభమవుతాయి. కళ్ల పక్కన సన్నగా గీతలు, కళ తప్పినట్టుగా కనిపించే చర్మం, మెల్లగా ముడతలు కనిపిస్తాయి
ఇవి వృద్ధాప్యానికి ప్రారంభ చిహ్నాలు. చర్మం నెమ్మదిగా సాగే గుణాన్ని కోల్పోచి వదులుగా మారుతుంది. చర్మం బిగుతుగా మారాలంటే ఈ జాగ్రత్తలు పాటిస్తేసరి
నిజానికి వయసు 30 దాటాక చర్మంలో కొలాజన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. తేమనిచ్చే మాయిశ్చరైజర్ వాడినా చర్మానికి పోషణ అందదు
ఫ్రీరాడికల్స్ వల్ల తలెత్తే వృద్ధాప్యఛాయలకు చెక్ పెట్టాలంటే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఉత్పత్తులను వినియోగించాలి
విటమిన్ ఇ, సి చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో సాయపడతాయి. రాత్రి రెటినాయిడ్ క్రీములను వినియోగించాలి
ఇవి కొలాజన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడతాయి. అంతేకాకుండా చర్మంపై ముడతలు, గీతలనూ తగ్గించడంలో సాయపడతాయి
ఎండ ప్రభావం సోకకుండా ఉండేందుకు ఎస్‌పీఎఫ్ 30 ఉన్న సన్‌స్క్రీన్‌ని వాడాలి. సాధ్యమైతే రోజులో కనీసం అరగంట పాటు వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి
విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్‌ని తరిమేందుకు తాజా కూరగాయలు, పండ్లు, లీన్ ప్రొటీన్, ఆరోగ్యమైన కొవ్వులు ఉండే ఆహారాలు తినాలి
ఇక్కడ క్లిక్ చేయండి