మన శరీరానికి కొంచెంగానే అవసరమైనా సూక్ష్మ పోషకాలు చాలా ఘనమైనవి. వీటిల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సిన విటమిన్లు, మినరల్స్ కొన్ని ఉన్నాయి
TV9 Telugu
భోజనంలో ఆకుకూరలు, పప్పు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. స్నాక్స్‌గా పల్లీ పట్టీలు, నువ్వుల పట్టీలు ఇంట్లోనే తయారు చేసుకుంటే తక్కువ ఖర్చుతో అయిపోతుంది. అలాగే ఏదైనా ఒక పండు తినాలి
TV9 Telugu
కానీ అందరికీ పోషకాహారం అందదు. దీంతో వారిలో పోషకాహార లోపం తలెత్తుతుంది. శరీరం కొన్నిసార్లు మనకు అనేక సంకేతాలను ఇస్తుంది. వీటిని నిర్లక్ష్యం చేయకుండా సరిచేయాలి
TV9 Telugu
ఒక్కోసారి మన శరీరంలో పోషకాల లోపం తలెత్తుతుంది. శరీరం ఇచ్చే అలర్ట్ ద్వారా అర్థం చేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడొచ్చు
TV9 Telugu
ఈ విధమైన లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం అవ్వాలి. ముఖ్యంగా పగటిపూట తరచుగా ఆవులిస్తూ ఉంటే, మీ శరీరంలో ఐరన్ లోపం ఉందని అర్ధం
TV9 Telugu
అలాగే తరచుగా నడుము నొప్పితో బాధపడుతుంటే, మీ శరీరంలో విటమిన్ డి లోపం ఉందని అర్థం చేసుకోవాలి. విటమిన్ డి అధికంగా ఉండే ఆహారంతోపాటు రోజూ కాసేపు ఎండలో ఉంటే సరిపోతుంది
TV9 Telugu
కొందరికి విపరీతగా చలిగా అనిపిస్తుంటుంది. వేడి వాతావరణంలో కూడా చలిని కలిగిస్తే, మీ శరీరంలో అయోడిన్ లోపం ఉన్నట్లు అర్ధం. అయోడిన్ సరిపడా తీసుకుంటే ఇలా అనిపించదు
TV9 Telugu
కండరాలు బలహీనంగా ఉనిపిస్తే.. మీ శరీరంలో మెగ్నీషియం లేకపోవడం వల్ల ఇలా జరుగుతుందని అర్ధం చేసుకోవాలి. అలాగే శరీరంలో విటమిన్ బి 12 లోపిస్తే చేతులు, కాళ్ళు మొద్దుబారిపోతాయి