23 September 2024
TV9 Telugu
Pic credit - Pexels
శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే కీళ్లలో నొప్పి మొదలవుతుంది. గౌటీ ఆర్థరైటిస్ అంటారు. యూరిక్ యాసిడ్ ని నియంత్రించుకోకపోతే కిడ్నీ సమస్యలు కూడా మొదలవుతాయి.
కొన్ని పాములు విషపూరితం కావు. అదే సమయంలో కొన్ని పాములు చాలా విషపూరితమైనవి. చాలా ప్రమాదకరమైనవి ఉన్నాయి.
అయితే విష పూరిత పాముల్లో ఒక పాము మరీ ప్రమాద కరం. ఈ పాము కాటు వేస్తె చీమ కుట్టినట్లు అనిపిస్తుంది. అంటే అసలు ఈ పాము కాటు నొప్పిని కలిగించదు.
అదే ఇండియన్ క్రైట్ అంటే తెలుగులో కట్ల పాము. ఇది కాటు వేస్తే పాము కరచినట్లు తెలియదు. అందుకనే ఇది సైలెంట్ కిల్లర. అర్ధరాత్రి వచ్చి నిద్రపోతున్న మనిషిని కాటేసి పోతుంటుంది.
ఈ పాము దంతాలు సన్నగా, సూదుల్లా చిన్నగా ఉంటాయి. ఇది ఎవరినైనా కరిచినప్పుడు తీవ్రమైన నొప్పి లేదా కరిచిన ప్రదేశంలో పాము కరచిన గుర్తులు ఏర్పడవు.
కట్ల పాము కరిస్తే దోమ కుట్టినట్లు ఉంటుంది. అయితే విషం శరీరం అంతా వేగంగా వ్యాపిస్తుంది.. దీంతో నిద్రలోనే మనిషి మరణిస్తాడు.
సాధారణ కట్ల పాములు రాత్రి సమయంలో సంచరిస్తాయి. రాత్రి ఆహారం కోసం వేటకు వెళ్తాయి. కప్పలు, బల్లులు, ఎలుకలను వేటాడతాయి.