బొప్పాయిని వీటితో కలిపి తీసుకుంటే.. విషంతో సమానం!

12 July 2024

TV9 Telugu

TV9 Telugu

బొప్పాయిలో విటమిన్ సి, ఎ, పొటాషియం, ఫైబర్ వంటి అనేక ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా రోగనిరోధక శక్తిని పెంచడంలో బొప్పాయి చాలా ప్రభావవంతంగా ఉంటుంది

TV9 Telugu

పండిన బొప్పాయి ఆరోగ్యానికి ఎంత ప్రయోజనకరమో, పచ్చి బొప్పాయి కూడా మలబద్ధకం, బరువు తగ్గడానికి బలేగా ఉపయోగపడుతుంది

TV9 Telugu

బొప్పాయి ఆరోగ్యానిక ఎంతో మేలు చేస్తున్నప్పటికీ కొన్ని ఆహారాలు బొప్పాయితో కలిపి అస్సలు తినకూడదు. ఫలితంగా అవి సత్ఫలితాలకు బదులు ఇవ్వడానికి బదులు మొదటికే మోసం వస్తుంది

TV9 Telugu

ప్రముఖ వైద్యుల అభిప్రాయం ప్రకారం.. బొప్పాయితో పెరుగు కలిపి తినకూడదు. పెరుగు ఒంటికి చలువ చేస్తుంది. బొప్పాయి వేడిగా ఉంటుంది. ఫలితంగా ఈ రెండూ కలిసి తినడం వల్ల తలనొప్పి వస్తుంది

TV9 Telugu

బొప్పాయి తిన్న తర్వాత పాలు, టీ, కాఫీలు కూడా అస్సలు తాగకూడదు. దీనివల్ల అది గ్యాస్ సమస్యకు దారి తీయవచ్చు. ఫలితంగా కడుపు నొప్పి, మలబద్ధకం వంటి సమస్యలు సంభవిస్తాయి

TV9 Telugu

బొప్పాయి మాదిరిగానూ కాకరకాయ కూడా ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైనది. అయితే ఈ కూరగాయను బొప్పాయితో కలిపి తినకూడదు

TV9 Telugu

బొప్పాయిలో నీరు అధికంగా ఉంటుంది. కాకర నీటిని పీల్చుకుంటుంది. ఫలితంగా రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్‌కు దారి తీస్తుంది

TV9 Telugu

అలాగే బొప్పాయితో నిమ్మకాయ కలిపి తినకూడదు. బొప్పాయి తిన్న తర్వాత కూడా చాలా సేపటి వరకు నిమ్మ కాయలను తినకూడదు. ఒకవేళ అలాచేస్తే జీర్ణ సమస్యలు తలెత్తుతాయి