కొబ్బరి పాలు జుట్టుకు ఓ వరం.. ఎలా అప్లై చేయాలంటే 

12 December 2024

Pic credit - Social Media

TV9 Telugu

కొబ్బరి నూనెను జుట్టుకు రాసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు అందరికీ తెలిసిందే. అయితే కొబ్బరి పాలు కూడా జుట్టుకు మేలు చేస్తాయి.

 కొబ్బరి పాలు

కొబ్బరి పాలలోని పోషకాలు జుట్టు కుదుళ్లను బలపరుస్తాయి. కొత్త జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. జుట్టు పెరుగుదలకు టానిక్‌గా పనిచేస్తాయి. 

కొత్త జుట్టు 

పొడి, నిర్జీవమైన జుట్టు, చుండ్రుతో సహా అనేక సమస్యల నుంచి కొబ్బరి పాలు ఉపశమనం ఇస్తాయి.  

జుట్టు సమస్యకి చెక్ 

వంటగదిలోని కొన్ని పదార్థాలను కొబ్బరి పాలతో కలిపి హెయిర్ మాస్క్ తయారు చేసి.. ఈ మిశ్రమాన్ని జుట్టుకి అప్లై చేయడం వల్ల ఫలితం ఉంటుంది.

హెయిర్ మాస్క్

కొబ్బరి పాలలో అలోవెరా జెల్ కలిపి అప్లై చేయడం వల్ల జుట్టు మృదువుగా మారడమే కాకుండా మెరుపు కూడా పెరుగుతుంది.

అలోవెరా జెల్తో కలిపి 

కొబ్బరి పాలలో తేనె కలిపి మిశ్రమాన్ని తయారు చేయండి.. ఈ హెయిర్ మాస్క్ ని అప్లై చేయడం వల్ల డల్ హెయిర్ సమస్య నయమవుతుంది.

 తేనెతో కలిపి 

ఆలివ్ నూనెను కొబ్బరి పాలలో కలిపి జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టుకు మెరుపు రావడమే కాకుండా ఎదుగుదలలో కూడా సహాయపడుతుంది.

ఆలివ్ ఆయిల్ తో