కొలెస్ట్రాల్‌ను ఐస్‌లా కరిగించే గోరుచిక్కుడు..!

Jyothi Gadda

27  June 2024

ఫైబర్ అధికంగా ఉండే గోరుచిక్కుడు చిక్కుడు జాతికి చెందినది. మనం ఎక్కువగా చిక్కుడు కాయ, బీన్స్‌ వంటివి తీసుకుంటాం. కానీ, గోరు చిక్కుడు కూరగాయను చాలామంది తక్కువగా తింటారు. 

గోరుచిక్కుడులో ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, కాల్షియం విటమిన్ సి ఉంటాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. హిమోగ్లోబిన్‌ పెరుగుతుంది. ఐరన్‌ లేమి సమస్యకు చెక్‌ పెట్టొచ్చు.  

చాలామంది మహిళలు ఐరన్‌ లేమితో బాధపడుతుంటారు. దీంతో వారు బలహీన సమస్యతో బాధపడుతుంటారు. అందుకే గోరుచిక్కుడు మహిళలకు వరం. వారానికి ఒకసారైనా తినాలి.

డయాబెటీస్‌, బీపీతో బాధపడుతున్న వారు కచ్చితంగా వారానికి ఒక్కసారైనా గోరుచిక్కుడు తినాలి. ఇది ఆరోగ్యానికి మంచిది. గుండె జబ్బులు ఉన్నవారు కూడా గోరుచిక్కుడు తినాలి.   

 ప్రెగ్నెన్సీ ఉన్న మహిళలకు కూడా గోరుచిక్కుడు ఎంతో ఉపయోగకరం. ఇందులో ఉండే ఫోలెట్‌ పిండం అభివృద్ధికి సహాయపడుతుంది. ఐరన్ ,కాల్షియం కూడా అందిస్తుంది.

గోరుచిక్కుడుతో హిమోగ్లోబిన్‌ స్థాయిలు కూడా పెరుగుతాయి. ఎర్రరక్తకణాలు ఏర్పడటానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫాస్పరస్ ,క్యాల్షియం ఎముకలను దృఢంగా మారుస్తుంది. 

కొలెస్ట్రాల్‌ను ఈజీగా తగ్గించేస్తుంది. ముఖ్యంగా బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి గోరుచిక్కుడు బెస్ట్‌ రెమిడీ. క్యాలరీలు తక్కువగా ఉంటాయి. దీంతో బరువు పెరగకుండా ఉంటారు. 

గోరు చిక్కుడు జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇందులోని ఫైబర్ మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇందులోని ఫైటోకెమికల్స్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.