గోరుచిక్కుడులో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. తక్కువ కేలరీలతో పాటు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, నీరు, ఫైబర్, చక్కెర, కాల్షియం, ఐరన్, విటమిన్ సి లభిస్తుంది.
గోరుచిక్కుడులోని అద్భుత గుణాలు ఆస్తమాకి చక్కని పరిష్కారంగా ఉంటుంది. కాబట్టి, ఆస్తమా ఉన్నవారు గోరుచిక్కుడుని రెగ్యులర్‌గా తీసుకోవడం మంచిది.
గోరుచిక్కుడులో ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, కాల్షియం విటమిన్ సి ఉంటాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. హిమోగ్లోబిన్ పెరుగుతుంది. ఐరన్ లేమి సమస్యకు చెక్ పెట్టొచ్చు.
గోరుచిక్కుడులో అనేక గుణాలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల బాహ్య, అంతర్గత పుండ్లు తగ్గుతాయి. ఇన్ఫెక్షన్లని దూరం చేసి మంటను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది.
గోరుచిక్కుడులో ఎన్నో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి సాల్మొనెల్లో సహా బ్యాక్టీరియాతో పోరాడే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
గోరుచిక్కుడుతో ఒంట్లోని హై కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ని తగ్గించే ఈ గోరుచిక్కుడు మంచి కొలెస్ట్రాల్ హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ని పెంచడంలో సాయపడుతుంది.
అంతేకాదు ప్రెగ్నెన్సీ ఉన్న మహిళలకు కూడా గోరుచిక్కుడు ఎంతో ఉపయోగకరం. ఇందులో ఉండే ఫోలెట్ పిండం అభివృద్ధికి సహాయపడుతుంది. ఐరన్ ,కాల్షియం కూడా అందిస్తుంది.