18 January 2024
TV9 Telugu
గ్లోబల్ వార్మింగ్ ప్రపంచవ్యాప్తంగా జీవవైవిధ్యానికి ముప్పును కలిగిస్తుంది. వాతావరణంలో మార్పు మనుషులపైనే కాదు మూగ జంతువులపై కూడా చూపిస్తోంది.
ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఇప్పుడు ఆడ తాబేళ్లు మాత్రమే పుట్టుకొస్తున్నాయని శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో గుర్తించారు.
వాస్తవానికి సముద్ర తాబేళ్లకు క్రోమోజోమ్‌లు ఉండవు. ఆడ తాబేలు తన గుడ్లను ఇసుకలో దాచినప్పుడు ఇసుక ఉష్ణోగ్రత ద్వారా సముద్ర తాబేలు పొదిగే పిల్లల లింగం ప్రభావితమవుతుంది.
వాతావరణ మార్పుల కారణంగా రోజు రోజుకీ ఉష్ణోగ్రత పెరుగుతోంది. దీంతో ఇసుక వేడెక్కుతోంది. దీని వల్ల మగ తాబేళ్ల కంటే ఆడ తాబేళ్లే ఎక్కువగా పుడుతున్నాయి.
నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ పరిశోధన ప్రకారం 82 డిగ్రీల ఫారెన్‌హీట్ కంటే తక్కువ పొదిగే తాబేలు గుడ్లు మగ తాబేళ్లు అయితే.. 89 డిగ్రీల ఫారెన్‌హీట్‌లో పొదిగితే ఆడ తాబేళ్లు అవుతాయి.
వరల్డ్ వైడ్ ఫండ్ అధ్యయనం ప్రకారం రోజు రోజుకీ సముద్ర ఆకుపచ్చ తాబేళ్ల సంఖ్య తగ్గిపోతుంది.
అధ్యయనం ప్రకారం అధిక ఉష్ణోగ్రతలు ఉన్న బీచ్‌లలో 99.1% పిల్ల తాబేళ్లు ఉండగా.. 86.8% వృద్ధ ఆడ తాబేళ్లు ఉన్నాయి. అదే చల్లని ప్రాంతాల్లో ఆడ తాబేళ్ల నిష్పత్తి 65%–69% గా ఉంది.
సాధారణంగా ఒక మగ తాబేలు తన జీవిత కాలంలో 20 నుంచి 30 వరకూ పిల్లలకు జన్మనిచ్చేలా సంతానోత్పత్తికి ఆడ తాబేలుకు సహకరించగలదు