సింపుల్ పద్దతిలో మీ మిక్సర్ గ్రైండర్ క్లీన్ చేయండిలా..

02 September 2023

ఈ రోజుల్లో రోటిలో రుబ్బిన మసాలాలు, దోసల పిండ్లు చాలా తక్కువ. ప్రాసెసింగ్ చేసిన మసాలా లేదా మిక్సీలో వేసి తయారు చేయడం జరుగుతుంది.

తరుచు వాడటం వల్ల మిక్సర్  గ్రైండర్ జిడ్డుగా మారుతుంది. రోజువారీ ఇందులో వేసిన సుగంధ ద్రవ్యాలు, ఆకులు వంటి మిక్సీకి అంటుకుంటాయి.

ఈ విధంగా రోజురోజుకు పేరుకుపోతే మిక్సీ ఎక్కువ కాలం పని చేయదు. త్వరగా పాడైపోతుంది. అలాగే మసాలా దినుసులను డర్టీ మిక్సీల్లో వేయడం కూడా ఆరోగ్యకరం కాదు.

చాలా మంది ప్రతిరోజూ మిక్సర్‌ను నీటితో శుభ్రం చేస్తుంటారు. కొందరు మిక్సర్ మెషీన్‌ను సబ్బుతో రుద్దుతారు. కానీ ఈ పద్ధతి వల్ల మిక్కీ త్వరగా క్షీణిస్తుంది.

డిష్ వాషింగ్ లిక్విడ్‌ను నీటిలో కలిపి కొద్ది మొత్తంలో తీసుకోని స్క్రబ్బర్‌తో బాగా స్క్రబ్ చేయండి. తరవాత తడి గుడ్డతో తుడవండి. చివరిగా మిక్సీని పూర్తిగా పొడిగా తుడవాలి.

ఒక చిన్న బౌల్ లో  బేకింగ్ సోడా వేసి కొద్దిగా నీరు వేసి పేస్ట్ చేయండి. ఈ పేస్ట్ తో 20 నిమిషాలు  జార్, మెషీన్‌పై రుద్ది, ఆపై నీటితో కడిగితే చాలు శుభ్రం అవడంతో పాటు వాసన పోతుంది.

లిక్విడ్ డిటర్జెంట్‌ను పూర్తిగా నురుగు వచ్చేలా చేసి ఆ ఫోమ్‌తో మిక్సీని బాగా రుద్ది 15 నిమిషాల పాటు అలానే ఉంచండి. తర్వాత పొడి గుడ్డతో పూర్తిగా శుభ్రం చేయండి.

మిక్సీతో పాటు కేబుల్, స్విచ్ కూడా చాలా జిడ్డుగా మారుతాయి. వీటిని, స్విచ్ బోర్డ్‌ను శుభ్రం చేయడానికి పొడి గుడ్డపై కోలిన్‌ను వేసి బాగా రుద్దండి. అంతే ఇవి మెరిసిపోతాయి.