జిడ్డుగల స్విచ్ బోర్డుని ఇలా శుభ్రం చేయండి

24 August 2023

స్విచ్‌బోర్డ్‌లను శుభ్రపరిచే ముందు విద్యుత్ లైన్ ఆపేయండి. ఆ తర్వాతే క్లీనింగ్ మొదలు పెట్టండి. చేతులకు గ్లోవ్స్, పాదాలకు చెప్పులు ధరించడం మర్చిపోవద్దు.

కరెంటు ఆఫ్ చేయండి

స్విచ్‌బోర్డ్‌లను శుభ్రం చేయడానికి వెనిగర్ ఉపయోగించవచ్చు. 1 కప్పు నీటిలో 2 స్పూన్ వెనిగర్, 1 స్పూన్ నిమ్మరసం కలపండి. ఇప్పుడు ద్రావణంలో టూత్ బ్రష్ లేదా గుడ్డను ముంచి స్విచ్‌బోర్డ్‌పై రుద్దండి.

వెనిగర్

స్విచ్‌బోర్డ్‌లను పాలిష్ చేయడానికి కూడా బేకింగ్ సోడాను ఉపయోగించవచ్చు. దీంతో బాగా రుద్దండి. మెరిసిపోతాయి. 

వంట సోడా

మరకలను వదిలించుకోవడానికి నెయిల్ పెయింట్ రిమూవర్‌ని కూడా ఉపయోగించవచ్చు. దీంతో క్లీన్ చేయవచ్చు. మరకలు అస్సలు కనిపించవు.

నెయిల్ పెయింట్ రిమూవర్‌..

ఆల్కహాల్ ఉపయోగించి స్విచ్‌బోర్డ్‌లపై పేరుకుపోయిన మురికిని తొలగించడం చాలా ఈజీ. ఆల్కహాల్ తీసుకుని మురికిగా ఉన్నవాటిపై ఓ క్లాత్‌తో రుద్దండి.

ఆల్కహాల్

ఒక గిన్నెలో 3-4 స్పూన్ల షేవింగ్ క్రీమ్ తీసుకోండి. ఇప్పుడు షేవింగ్ క్రీమ్‌లో టూత్ బ్రష్ లేదా క్లీనింగ్ బ్రష్‌ని డిప్ చేసి స్విచ్ బోర్డ్‌కి అప్లై చేసి 15 నిమిషాలు అలాగే ఉంచండి.

షేవింగ్ క్రీమ్

స్విచ్‌బోర్డ్‌ను క్లీన్ చేసిన తర్వాత.. వెంటనే వాటిని ఆన్ చేయకుండా ఉండండి. మెయిన్ పవర్‌ను ఆన్ చేయడానికి ముందు కొంత సమయం వేచి ఉండండి.

వెంటనే ఇలా చేయకండి..