2 ఏళ్ల లోపు చిన్నారులను ఫోన్​కు దూరంగా ఉంచాల్సిందే

05 September 2024

Battula Prudvi 

ఆరేళ్ల నుంచి 12 ఏళ్లలోపు పిల్లలు రెండు గంటలు టీవీలు, ఫోన్లు చూసేందుకు స్వీడన్‌ ప్రభుత్వం అనుమతినిచ్చింది.

13 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపు వారిని రోజులో రెండు, మూడు గంటలే టీవీలు, స్క్రీన్లు చూసేందుకు పరిమితం చేయాలని తెలిపింది.

2 ఏళ్ల లోపు చిన్నారులను ఫోన్​కు దూరంగా ఉంచాల్సిందే అని తల్లిదండ్రలు హెచ్చరించింది స్వీడన్‌ ప్రభుత్వం.

మన దేశంలో కూడా ఫోన్​ విషయంలో పిల్లలు చేస్తున్న పొరపాట్లు, తప్పులపై నిరంతరం నిఘా ఉంచాల్సిన అవసరం ప్రతి తల్లి, తండ్రిపై ఉంది.

ఎప్పుడూ వారి వెనకాలే ఉండి ప్రతిదీ గమనించలేం గనుక వారి చేతికి మొబైల్​ ఫోన్​ ఇచ్చేముందు వాటిల్లో కొన్ని సెట్టింగ్​లను మార్చి ఇస్తే సరిపోతుంది.

యాప్​ రెస్ట్రిక్షన్స్, కంటెంట్​, ప్రైవసీ, డౌన్​టైమ్​ షెడ్యూల్ వంటి వివిధ రకాల పరిమితులను కూడా పిల్లల ఫోన్లో సెట్​ చేయవచ్చు.

దీంతో మీ పిల్లలు అసభ్యకరమైన వెబ్​సైట్​ల జోలికి పోకుండా నియంత్రించగలిగిన వారవుతారు. స్క్రీన్​ టైమ్​, కంటెంట్​ యాక్సెస్ ను కూడా సెట్‌ చేయవచ్చు.

'పేరెంటల్​ కంట్రోల్స్​' సహాయపడతాయి. మీ పిల్లల వయసుకు తగ్గట్టు కంటెంట్​ను మాత్రమే యాక్సెస్​ చేసి చూసేలా కూడా ఇందులో సెట్టింగ్స్​ చేసుకోవచ్చు.