మీ పిల్లలు బరువు పెరగడం లేదా? రోజూ వీటిని తినిపించండి..
07 September 2023
చాలా మంది పిల్లలు ఫుడ్ అంటేనే చాలు ఆమడ దూరం పారిపోతుంటారు. ఫుడ్ విషయంలో తల్లిదండ్రులకు చుక్కలు చూపిస్తుంటారు. సరిగా తినకపోవడం పిల్లల ఎదుగుదలపై ప్రభావం పడుతుంది.
మీ పిల్లలు కూడా ఇలాంటి సమస్యే ఎదుర్కొంటున్నారా? మీ పిల్లల్లోనూ ఎదుగుదల లేదా? అది ఖచ్చితంగా పోషకాహార లోపమే అయి ఉంటుంది. రోజూ వీటిని తినిపిస్తే పిల్లల ఎదుగుదలకు దోహదపడుతాయి.
పిల్లలైనా పెద్దలైనా ప్రతి రోజూ పండ్లు, కూరగాయలు తినాలని వైద్యులు సూచిస్తుంటారు. ఫలితంగా వారి రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. శరీరానికి అవసరమైన విటన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్స్ అందుతాయి.
తృణధాన్యాలు: బ్రౌన్ రైస్, హోల్ వీట్, క్వినోవా వంటి ఆహారాలను ఆహారంలో చేర్చుకోండి. ఇది శరీరానికి ఫైబర్ ఇస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. శరీరానికి కొత్త శక్తిని ఇస్తుంది.
అమైనో యాసిడ్ ఫుడ్స్: చేపలు, బీన్స్, టోఫు వంటి లీన్ ప్రోటీన్లను ఆహారంలో చేర్చడం ద్వారా శరీరానికి అమైనో ఆమ్లాలు అందించబడతాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో, కండరాల పునర్నిర్మాణంలో సహాయపడుతాయి.
పాల ఉత్పత్తులు: పాలతో తయారు చేయబడిన ఉత్పత్తులు మన శరీరానికి కాల్షియం, విటమిన్ డి ని అందిస్తాయి. ఇది మన దంతాలు, ఎముకలను బలపరుస్తుంది. అలాగే శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది.
అవకాడో: ఆరోగ్యకరమైన కొవ్వును పెంచుతుంది. మన మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. హార్మోన్లను సమతుల్యంగా ఉంచడంలో దోహపడుతుంది. అవోకాడో, దాని గింజలు, ఆలీవ్ నూనెతో చేసిన ఆహారాలను పిల్లలకు తినిపించాలి.
డ్రింకింగ్ వాటర్: శరీరం ఆరోగ్యంగా ఉంచుకోవడానికి నీరు చాలా ముఖ్యం. ఒక వ్యక్తి రోజుకు కనీసం 3 లీటర్ల నీరు త్రాగాలి. పిల్లలకు కూడా మంచి నీరు తాగే అలవాటు చేయండి. తద్వారా శరీరంలోని మలినాలు బయటకు వెళతాయి.