చియా సీడ్స్ వల్ల కలిగే ప్రయోజనాలు.. తెలిస్తే ఎప్పటికీ వదులుకోరు...

13 November 2023

చియా విత్తనాలు శరీరాన్ని చల్లబరచడానికి మాత్రమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.

కుసుమపువ్వు గింజల మాదిరిగానే, చియా గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి మేలు చేస్తాయి.

చియా గింజల్లో కాల్షియం, ప్రోటీన్, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి మన ఎముకలను బలోపేతం చేస్తాయి. 

చియా విత్తనాల్లో దాదాపు 92 శాతం కరిగే ఫైబర్‌తో నిండి ఉంటాయి. అందువలన, స్టార్చ్ తక్కువగా ఉంటుంది. ఇది మ గట్‌ కు మేలు చేస్తుంది. 

శరీర అవయవాల వాపు తగ్గుతుంది. ఇన్సులిన్ స్రావం పెరుగుతుంది. శరీరానికి మేలు చేసేటటువంటి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.

చియా విత్తనాలు గుండె సంబంధిత వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా, ఇది రక్తంలో ట్రైగ్లిజరైడ్ కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది.

చియా గింజల్లో కాల్షియం, ప్రోటీన్, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి మన ఎముకలను బలోపేతం చేస్తాయి. 

శరీర కణాలపై దాడి చేసే క్రిములను చంపడంలో చియా విత్తనాలలో యాంటీ ఆక్సిడెంట్ల పాత్ర ఎక్కువగా ఉంటుంది. వృద్ధాప్యాన్ని నివారిస్తుంది.