మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఎంత ప్రమాదమో తెలుసా.. 

06 December 2024

Pic credit - Getty

TV9 Telugu

మొలకెత్తిన, పచ్చగా మారిన బంగాళాదుంపలను తినడం ఆరోగ్యానికి హానికరం అని.. వీటికి దూరంగా ఉండటమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. 

బంగాళదుంపలను మార్కెట్ నుంచి కొనుగోలు చేసిన సమయంలో లేదా ఇంట్లో నిల్వ చేసిన తర్వాత కొన్ని మొలకెత్తిన బంగాళాదుంపలు ఉంటాయి. 

అయితే ఇలా మొలకెత్తిన బంగాలదుంపల మొలకలను కోసి ఆహార పదార్దాలను తయారు చేసుకోవడం మామూలే. అయితే ఈ తప్పు ఎప్పుడూ చేయకండి.

మొలకెత్తిన లేదా లేత ఆకుపచ్చగా మారిన బంగాళదుంపలలో చాకోనిన్, సోలనిన్ ఉత్పత్తి అవుతాయి. పోషక విలువ తగ్గడం మొదలు అవుతాయి 

చాకోనిన్, సోలనిన్ ఉత్పత్తి బంగాళాదుంపలను అంటే ఈ విష పదార్థాలను తీసుకోవడం వల్ల శరీరంపై చెడు ప్రభావం ఉంటుంది.

మొలకెత్తిన బంగాళదుంపలు తినడం వల్ల వికారం, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి వస్తుంది. 

ప్రభావం మరింత తీవ్రమైతే తలనొప్పి, తల తిరగడం,  బీపీ తగ్గడం, జ్వరంతో పాటు నరాల సంబంధిత సమస్యలు కూడా కలుగుతాయి. కనుక జాగ్రత్తగా ఉండాలి. 

బంగాళా దుంపలను తినడం వలన కలిగి సమస్యలను గుర్తించి సరైన సమయంలో సరైన చికిత్స పొందకపోతే ప్రాణం పోయే ప్రమాదం కూడా ఉంది.