కల్లు తాగితే ఆరోగ్యానికి మంచిదా కాదా? తెలుసుకోండి!

Jyothi Gadda

05 December 2024

TV9 Telugu

కల్లు ఆరోగ్యానికి మంచిదే.. కానీ అది మితంగా తీసుకున్నప్పుడే మంచి ప్రయోజనాలను ఇస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

TV9 Telugu

తాటి కల్లులో యాంటీ ఆక్సిడెంట్ లు ఉన్నాయి. ఇవి మనల్ని ప్రీ రాడికల్స్ నుండి కాపాడతాయి. కల్లులోఉండే పోషకాలు మన ఆరోగ్య రక్షణకు దోహదం చేస్తాయి.

TV9 Telugu

క్యాన్సర్, గుండె జబ్బులకు కారణమయ్యే ప్రీ రాడికల్స్ ను నిరోధిస్తాయి. ఈతకల్లులో విటమిన్ సి, విటమిన్ బి1, రిబోఫ్లావిన్ ఉన్నాయి. కల్లులో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యానికి మంచిది.

TV9 Telugu

కల్లులో మన శరీరానికి కావాల్సిన అద్భుత పోషకాలు ఉన్నాయి. కల్లు విటమిన్ B, విటమిన్ C, పొటాషియం, ఐరన్, జింక్, మాగ్నీషియం వంటి విభిన్న పోషకాలతో నిండి ఉంటుంది. 

TV9 Telugu

తాటి కల్లు ఎలక్ట్రోలైట్‌లను సమృద్ధిగా కలిగి ఉండటంతో, ఇది శరీరంలో న్యూట్రియంట్‌లను సంతులనం చేయడంలో సహాయపడుతుంది. కల్లులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. 

TV9 Telugu

కల్లులోని పోషకాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. కల్లు‌లో ఎసిటిక్ యాసిడ్ బ్యాక్టీరియా మరియు లాక్టిక్ యాసిడ్ బాక్టీరియా ఉంటాయి. ఇది మీ గట్ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. 

TV9 Telugu

కల్లు పాలిచ్చే తల్లులకు పాల ఉత్పత్తి పెంచే పానీయంజ ఈతకల్లు పాలిచ్చే తల్లుల్లో పాల ఉత్పత్తిని మెరుగు పరచటానికి దోహదం చేస్తుంది. తల్లి పాలు శిశువులకు ఉత్తమ ఆహారం.

TV9 Telugu

ఇది పోషకాలను, రోగనిరోధక శక్తిని అందిస్తుంది. ఈతకల్లు ప్రొలాక్టిన్, ఆక్సిటోసిన్ హార్మోన్లను ప్రేరేపించడం ద్వారా తల్లుల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది. పాల నాణ్యత కూడా పెంచుతుంది. 

TV9 Telugu