పైల్స్‌ సమస్యకు బెస్ట్ మెడిసిన్ తమలపాకు.. ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో.. 

16 September 2024

TV9 Telugu

Pic credit -  Pexels

తమలపాకుని ఆయుర్వేద వైద్యం, పూజల్లో, శుభకార్యాలలో విస్తృతంగా ఉపయోగిస్తారు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అనేక రకాల ఆరోగ్య సమస్యలను నివారిస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు

ఆరోగ్యానికి మేలు 

తమలపాకుల్లో విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్‌ వంటివి ఉన్నాయి. ఆకలి తక్కువ ఉన్నవారు తమలపాకుని తింటే ఆకలి పెరుగుతుంది. 

ఆకలి పెంచుతుంది 

తమలపాకులు LDL కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడమే కాదు HDL కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతాయి. అంతేకాదు రక్తంలో షుగర్ లెవెల్స్ ను నియంత్రించడానికి సహాయపడతాయి. 

షుగర్ కంట్రోల్ 

తమలపాకులు జీర్ణక్రియను మెరుగుపరచడమే కాదు.. మలబద్ధకాన్ని నివారించడానికి కూడా సహాయపడతాయి. ఊబకాయాన్ని కూడా నియంత్రిస్తాయి.

మలబద్దకాన్ని నివారిస్తుంది 

తమలపాకులు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వ్యాధుల బారిన పడకుండా సహాయపడతాయి.

రోగనిరోధక శక్తి

తమలపాకులు కళ్ల ఆరోగ్యాన్ని మెరుగు పరచి దృష్టిని మెరుగుపరస్తాయి. 

దృష్టి మెరుగుపరుస్తాయి 

యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు రోజూ తాజా తమలపాకులను తినడం వలన యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గిస్తుంది.

యురిస్ యాసిడ్ సమస్య 

తమలపాకు పైల్స్‌ సమస్యకు బెస్ట్ మెడిసిన్.  వీటిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలు పైల్స్‌ వల్ల కలిగే అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.  

తమలపాకు పైల్స్‌ సమస్య

తమలపాకు పైల్స్‌ వల్ల కలిగే రక్తస్రావాన్ని ఆపుతుంది. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పైల్స్‌ వల్ల కలిగే ఇన్ఫెక్షన్‌లను తగ్గిస్తాయి.

రక్తస్రావం ఆపుతుంది

తమలపాకు ఆకులను శుభ్రం చేసి తర్వాత వాటి నుంచి రసం తీసి.. ఆ రసాన్ని ప్రభావిత ప్రాంతానికి అప్లై చేయండి. ఇలా చేయడం ఫైల్స్ నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఎలా ఉపయోగించాలంటే