నాన్‌స్టిక్‌ పాత్రలు వాడితే జరిగేది ఇదే!

05 July 2024

TV9 Telugu

TV9 Telugu

నాన్‌స్టిక్‌ పాత్రల్లో వంట అడుగంటదు. ఏం వండినా చక్కగా ఉడుకుతాయి... వంటి ఎన్నో వెలుసుబాటులు ఉంటాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. వీటిని దీన్ని సరైన దిశలో వాడకపోతే మాత్రం ఆరోగ్యానికి ప్రమాదం తప్పదు

TV9 Telugu

అవును.. నాన్‌స్టిక్‌ పాత్రలు సరైన రీతిలో వాడకపోతే క్యాన్సర్‌ వంటి ప్రమాదకర జబ్బులు వస్తాయని హెచ్చరిస్తోంది ఐసీఎంఆర్‌. మరి దీన్నెలా వాడాలి? అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం..

TV9 Telugu

వండే ఆహారం పాత్రలకు అతుక్కోకుండా ఉండేందుకు 1930ల్లో పాలీటెట్రాఫ్లోరోఎథిలీన్‌ (టెఫ్లాన్‌) కోట్‌ని కనిపెట్టారు. ఇది కార్బన్, ఫ్లోరిన్‌ అణువులతో కూడిన కృత్రిమ రసాయనం

TV9 Telugu

వెబ్‌ఎండీ రిపోర్ట్‌ ప్రకారం టెఫ్లాన్‌లో ఉండే పెర్‌ఫ్లోరినేటెడ్‌ ఆక్టానోయిక్‌ ఆమ్లం కిడ్నీ, కాలేయ వ్యాధులకూ, సంతానలేమికీ కారణం అవుతుందని ఐసీఎంఆర్‌ పేర్కొంది

TV9 Telugu

డైటరీ గైడ్‌లైన్స్‌ ఫర్‌ ఇండియన్స్‌ పేరుతో నాన్‌-స్టిక్‌ కుకర్‌వేర్‌ను తప్పుగా ఉపయోగించడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించీ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా నాన్‌-స్టిక్‌ పాత్రలను ఎక్కువ వేడి చేయడం వల్ల వంటల్లోకి విషపూరిత రసాయనాలు చేరి ఆరోగ్యానికి హాని చేస్తాయట

TV9 Telugu

అందుకే, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తప్పనిసరిగా మట్టిపాత్రలు, కోటింగ్‌ లేని గ్రానైట్‌ గిన్నెలు వంటివే వాడాలనీ సూచిస్తున్నారు. ఒకవేళ తప్పనిసరై నాన్‌స్టిక్‌ వాడితే.. పాత్రల్ని వాడే ముందు కాస్త బేకింగ్‌ సోడా వేసి గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేస్తే రసాయనాలు పోతాయి

TV9 Telugu

నాన్‌స్టిక్‌ గిన్నెల్ని ప్రీహీట్‌ చేయడం మంచిది కాదు. అలానే పెద్ద మంటమీదా వంట చేయకూడదు. ఇలా చేస్తే వాటి పైన ఉండే టెఫ్లాన్‌ కోట్‌ కరిగి హానికరంగా మారుతుంది

TV9 Telugu

ఎసిటిక్‌ గుణాలున్న టొమాటో, నిమ్మ, చింతపండు వంటి వాటితో చేసే పదార్థాలను ఇందులో వండకపోవడమే మేలు. వీటి రసాయనిక చర్యలకు కెమికల్స్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. వీలైనంత వరకూ వేడి నీళ్లు, లిక్విడ్‌ సోప్‌లతో మాత్రమే వీటిని శుభ్రం చేయాలి