01 October 2024
TV9 Telugu
Pic credit - Pexels
గత కొంతకాలంగా ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా అన్నానికి బదులుగా చపాతీలను తింటున్నారు. చపాతీలు ఆరోగ్యానికి ఓ వరంగా భావిస్తున్నారు.
చపాతీలను తినడం వలన శరీరానికి రకరకాల పోషకాలు అందుతాయి. అయితే కొంతమంది మాత్రం చపాతీలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. ఎందుకంటే
బరువు తగ్గడం కోసం ఎక్కువ మంది చపాతీలను తినే ఆహారంలో చేర్చుకున్నారు. అయితే ఎక్కువ బరువు లేదా ఊబకాయం సమస్యల ఉన్నవారు మాత్రం గోధుమ పిండి చపాతీ తినోద్దట. ఎదుకంటే బరువు మరింత పెరుగుతారట.
జీర్ణ సంబంధిత సమస్యలు అంటే.. గ్యాస్, అజీర్ణం, పుల్లని బర్పింగ్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు గోధుమతో చేసిన చపాతీలకు దూరంగా ఉండాలి. లేదంటే ఈ సమస్య మరింత పెరుగుతుంది.
గోధుమ చపాతీల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈ చపాతీలను ఎక్కువగా తింటే షుగర్ పేషెంట్స్ రక్తంలో షుగర్ లెవెల్ పెరుగుతుంది. కనుక షుగర్ పేషెంట్స్ గోధుమ చపాతీలకు దూరంగా ఉండాలి.
కఫం, జ్వరం, జలుబు, ఫ్లూ, కఫం వంటి అనారోగ్య సమస్యలున్నవారు గోధుమ చపాతీలను తినొద్దు. ఎందుకంటే గోధుమ చపాతీలను తింటే ఈ సమస్య మరింత పెరుగుతుంది.
అయితే గోధుమ పిండికి బదులు మల్టీగ్రెయిన్ పిండితో చేసిన రోటీలు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అంటే సజ్జలు, మొక్కజొన్న, బార్లీ, జొన్న, రాగులు వంటి చిరు ధాన్యాలతో తయారు చేసిన చపాతీలను తినొచ్చు.
మల్టీగ్రెయిన్ పిండి తో చేసిన రోటీలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మెటబాలిజాన్ని పెంచుతుంది. అంతేకాదు జీవక్రియ కూడా వేగంగా జరుగుతుంది.
బరువు పెరగాలనుకునేవారు గోధుమ పిండితో చేసిన చపాతీలు తినొచ్చు. అదే సమయంలో బరువు తగ్గాలనుకుంటే మల్టీగ్రెయిన్ పిండి రోటీ తినొచ్చు.