నేరుగా మంట మీద కాల్చిన రోటీ తింటున్నారా.. వ్యాధులకు వెల్కం చెప్పినట్లే.. 

13 July 2024

TV9 Telugu

Pic credit - pexels

భారతీయులు తినే ఆహారంలో చపాతీలు, పుల్కాలకు ప్రముఖ స్థానం ఉంది. ఎక్కువగా గోధుమ పిండితో చేసిన రోటీలను తింటారు, అయితే వీటిని తయారు చేయడంలో చేసే తప్పు ఖర్చుతో కూడుకున్నదని మీకు తెలుసా...ఎలా అంటే 

 చపాతీలు, పుల్కాలు 

భారతీయ వంటగదుల్లో గ్యాస్‌ స్టవ్ ఉండాల్సిందే. ప్రతిదీ LPG గ్యాస్‌తో నడిచే మంటపై వండుతున్నారు. ఒకప్పుడు పొయ్యిలోని బొగ్గుల మీద నేరుగా రొట్టెలు కాల్చేవారు. ఇప్పుడు గ్యాస్ మంట మీద నేరుగా రోటీని కాలుస్తున్నారు. ఇది ఆరోగ్యానికి హానికరం. 

నేరుగా మంట మీద కాల్చడం 

అనేక పరిశోధనల ప్రకారం రోటీని నేరుగా మంటపై కాల్చడం వల్ల అక్రిలామైడ్, క్యాన్సర్ కారకాలు వంటి రసాయనాలు విడుదలవుతాయి. టీలను డైరెక్ట్‌గా స్టౌ పై పెట్టి కాల్చడం వల్ల క్యాన్సర్ వస్తుందని చెబుతోంది.

పరిశోధన ఏం చెబుతోంది?

నేరుగా మంట మీద కాల్చిన రొట్టె తింటే కడుపులో గ్యాస్ సమస్య ఏర్పడుతుందట. ఇప్పటికే గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్న వారు ఈ రకమైన రోటీ తినడం వల్ల రోజంతా ఇబ్బంది పడాల్సి వస్తుంది.

గ్యాస్ట్రిక్ సమస్య

రోటీని నేరుగా మంటపై కాల్చినప్పుడు అందులో ఉండే పీచు పదార్ధం చెడిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి రోటీలను తినడం వలన ఆరోగ్యం కంటే అనారోగ్యమే ఎక్కువ. కనుక ఇలా చేయడం మానుకోండి.

పైబర్ నష్టం 

నేరుగా మంటపై కాల్చిన రోటీని తింటే, కొంత సమయం తర్వాత మీరు కడుపు సమస్యలను ఎదుర్కోవచ్చు. కడుపు ఉబ్బరం, కడుపు బరువు లేదా ఇతర సమస్యలు సంభవించవచ్చు.

ఇతర కడుపు సమస్యలు

రోటీని నేరుగా మంటలో కాకుండా ఇనుప పాన్‌పై కాల్చవచ్చు. ఒక గుడ్డ సహాయంతో పాన్ మీద రోటీని కాల్చవచ్చు. ఇలా చేయడం వల్ల రోటీలోని మూలకాలు అందులో ఉండడమే కాకుండా రుచికరంగా కూడా ఉంటాయి

ఇలా రోటీని కాల్చండి