చాణక్య నీతి : పెళ్లి తర్వాత భార్యను బాధపెట్టే పురుషులు వీరే!

Samatha

2 august  2025

Credit: Instagram

ఆచార్య చాణక్యుడి గురించి ఎంత చెప్పినా తక్కువే, ఆయన తన అనుభవాల ఆధారంగా నీతి శాస్త్రం పుస్తకాన్ని రచించి ఎన్నో కొత్త విషయాలను తెలియజేశాడు.

ఆచార్య చాణక్యుడు తన జీవిత అనుభవాల ద్వారా సమాజం, బంధాల గురించి చాలా  వివరంగా తెలిపారు, అవి నేటి తరం వారికి  ఎంతగానో ఉపయోగపడుతాయి.

చాణక్య నీతిలో ఆ చార్య చాణక్యుడు, ఈ అలవాట్లు ఉన్న పురుషులను వివాహం చేసుకుంటే,ఆ మహిళ జీవితం పూర్తిగా నాశనం కావడం ఖాయం అని తెలిపారు. ఆ లక్షణాలు ఏవో చూద్దాం.

చాణక్యనీతి ప్రకారం ఎవరైతే సోమరిగా ఉంటారో ఆ పురుషులు కుటుంబానికి భారంగా మారతారు, ప్రతీ పనిని వాయిదా వేస్తూ,  భార్యలను మానసిక క్షోభకు గురి చేస్తారంట.

చాణక్యుడి ప్రకారం, వివాహం తర్వాత ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుచుకోని వారు తమ భార్యలపై ఆధార పడతారంట. దీని వలన ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడతారంట.

ఏ వ్యక్తికైతే మద్యపానం లేదా మాదకద్రవ్యాల అలవాటు ఉంటుందో, అలాగే వాటికి బానిస అవుతారో, వారు తమ భార్యకు భారంగా మారుతారంట.

ఆ చార్య చాణక్యుడి ప్రకారం, ఏ వ్యక్తికి అయితే అతి కోపం లేదా హింసాత్మక స్వభావం ఉంటుందో వారు తమ భార్యలను అభద్రతా భావానికి గురి చేస్తారంట.

అదే విధంగా ఏ ఇంట్లో పురుషులు కుటుంబ బాధ్యతలు తీసుకోకుండా ఉంటారో ఆ ఇంటిలోని భార్యపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతుందంట.

చాణక్య నీతి ప్రకారం, చెడు ప్రవర్తన, చెడు స్వభావం గల పురుషులు తమ గౌరవాన్ని కోల్పోవడమే కాకుండా భార్య దగ్గర కూడా తమ విలువను కోల్పోతారంట.