లక్షద్వీప్‌ పర్యాటకానికి ఊతమిస్తూ కొత్త ఎయిర్‌పోర్ట్‌ను నిర్మించనున్న కేంద్రం.. !

TV9 Telugu

10 January 2024

ప్రస్తుతం ప్రపంచం దృష్టి మొత్తం లక్షద్వీప్‌పైనే ఉంది. బాయ్‌కాట్‌ మాల్దీవులు హ్యాష్‌ట్యాగ్‌ సోషల్‌ మీడియాలో ఇంకా ట్రెండ్‌ అవుతుంది.

మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యల నేపథ్యంలో భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

లక్షద్వీప్‌లోని మినీకాయ్ ద్వీపంలో కొత్తగా ఓ విమానాశ్రయాన్ని నిర్మించాలని కేంద్రం ప్రభుత్వం యోచిస్తుంది.

మినీకాయ్‌ ద్విపంలో విమానాశ్రయం నిర్మాణం చేపడితే లక్షద్వీప్‌లో పర్యాటకం సైతం మరింత అభివృద్ధి చెందుతుంది.

లక్షద్వీప్‌లోని కొత్త విమానాశ్రయం నిర్మాణం ఇండియన్ మిలటరీకి సైతం ఎంతో ఉపయోగంగా ఉండనుందని అంటున్నారు.

పౌర విమానాలతో పాటు మిలటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, ఫైటర్‌ జెట్స్‌కు కొత్త ఎయిర్‌పోర్ట్‌ జాయింట్ ఎయిర్‌ఫీల్డ్‌గా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు యోచిస్తున్నాయి.

ఇది జరిగితే లక్షద్వీప్‌కి పర్యాటకుల తాకిడి పెరిగే అవకాశాలు ఎక్కువగా అన్నాయి. దీంతో పర్యటలో భారత్ కి మరికొంత లాభం వస్తుంది.

ఇక ఐలాండ్ ప్రకృతిని ఆస్వాదించాడని మాల్దీవులు వరకు వెల్లవలసిన పని ఉండదు. హాయిగా సొంత దేశంలోనే చూడవచ్చి.