జీడిపప్పు, పిస్తా.. ఏది ఆరోగ్యానికి మేలు చేస్తుంది?

30 October 2024

TV9 Telugu

TV9 Telugu

డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా బాదం, జీడిపప్పు, వేరుశెనగ, వాల్‌నట్స్‌, పుచ్చగింజలు, ఎండు ద్రాక్ష, అంజీర్‌ ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి

TV9 Telugu

ఇవి మంచి పోషకాలు కలిగి ఉన్నందున ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో జీడిపప్పు, పిస్తాలకు ప్రత్యేక స్థానం ఉంది. వీటిని రకరకాల స్వీట్లు, వంటకాల్లో వాటి రుచిని మెరుగుపరచడానికి వినియోగిస్తుంటారు

TV9 Telugu

జీడిపప్పు, పిస్తా రెండూ అనేక రకాల డెజర్ట్‌ల తయారీలో ఉపయోగించే గింజలు. చాలా మంది వాటిని స్నాక్స్‌గా కూడా తినడానికి ఇష్టపడతారు

TV9 Telugu

 అయితే ఈ రెండింటిలో ఏది ఎక్కువ ఆరోగ్యానికి ప్రయోజనకరమైనది? అనే సందేహం మీకెప్పుడైనా వచ్చినట్లయితే ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం

TV9 Telugu

సుమారు 18 జీడిపప్పులో ప్రొటీన్ 4.21గ్రా, ఫైబర్ 0.82గ్రా, కాల్షియం 12.5మి.గ్రా, కాపర్ 0.16మి.గ్రా, మెగ్నీషియం 71.4మి.గ్రా, ఫాస్పరస్ 135మి.గ్రా, పొటాషియం 15,4.5మి.గ్రా. 65 MG ఐరన్‌ ఉంటాయి

TV9 Telugu

పిస్తాపప్పులో కూడా జీడిపప్పుతో సమానమైన మొత్తంలో ప్రోటీన్ 3గ్రా, ఫైబర్ 3గ్రా, పొటాషియం 6 శాతం, ఫాస్పరస్ 11%, బి1 21%, బి6 28%, రాగి 41%, మాంగనీస్ 15% ఉంటాయి

TV9 Telugu

అందుకే జీడిపప్పు, పిస్తా పప్పులు ఈ రెండింటిలోనూ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కానీ పోషక విలువలలో స్వల్ప వ్యత్యాసం ఉంటుంది. వీటిల్లో ఎక్కువ ఏది ప్రయోజనకరమైనది అనే ప్రశ్న తలెత్తితే సమాధానం రెండూ అని చెప్పాలి

TV9 Telugu

జీడిపప్పు-పిస్తాలను మిడ్ స్నాక్స్‌గా తీసుకోవచ్చు. ఇది బరువును నిర్వహించడంలో సహాయపడుతుంది. కావల్సిన శక్తిని ఇస్తుంది. అవసరమైన సూక్ష్మ పోషకాలు శరీరానికి సరిపడా అందుతాయి