పాలలో యాలకుల పొడి కలిపి తాగితే..
Narender Vaitla
08 November
2024
పాలలో కాల్షియం అధికంగా ఉంటుందని తెలిసిందే. అందుకే ప్రతీ రోజూ రాత్రి పడుకునే ముందు గ్లాసు పాలు తాగి పడుకుంటే శరీరంలో క్యాల్షియం లోపాన్ని జయించచ్చు.
ఇక పాలలో యాలకుల పొడి కలుపుకొని తాగితే జీర్ణ సంబంధిత సమస్యలన్నీ దూరమవుతాయి. ముఖ్యంగా కడుపుబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను తరిమికొట్టడంలో దోహదపడుతుంది.
పాలు, యాలకుల పొడి కలిపి తీసుకుంటే మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఒత్తిడి తగ్గుతుంది.
చలికాలంలో వచ్చే గొంతు సంబంధిత సమస్యలకు సైతం ఇది బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా జలుబు, దగ్గు వంటి సమస్యలు పరార్ అవుతాయి.
కఫలంతో బాధపడేవారికి కూడా యాలకుల పాలు బాగా ఉపయోగడపతాయి. రోజూ క్రమంతప్పకుండా తీసుకుంటే కఫం సమస్య దూరమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
కీళ్లనొప్పులు, కండరాల సమస్యలో బాధపడేవారు రెగ్యులర్‌గా పాలు, యాలకుల పొడిని తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి ఇవి ఎంతగానో ఉపయోగపడుతుంది. రాత్రి పడుకునే ముందు ఈ పాలను తీసుకోవడం వల్ల మంచి నిద్ర సొంతమవుతుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
ఇక్కడ క్లిక్ చేయండి..